Tuesday, May 21, 2024
- Advertisement -

ప్లీజ్.. ఆ ప్రచారం మానుకోండి

- Advertisement -

మంచి చేయకపోయినా పర్వాలేదు.. కానీ కావాలని చెడు మాత్రం ప్రచారం చేయకండి.. అని కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. రీసెంట్ గా రిలీజైన సర్దార్ గబ్బర్ సింగ్ ట్రయిలర్.. ఫ్యాన్స్ కు పూర్తిగా నిరాశ మిగిల్చిందంటూ జరుగుతున్న ప్రచారంపై… కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

పవన్ ఎవరికి నష్టం చేశాడని.. ఇలా యాంటీ క్యాంపెయిన్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సినిమా విడుదలైతే.. అప్పుడు పవన్ స్టామినా ఏంటో అందరికీ తెలుస్తుందని.. ఈ సినిమా సంచలన విజయం సాధించడం ఖాయమనీ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

టీజర్ రిలీజైన దగ్గర్నుంచి.. పాటల వరకూ.. ప్రతి విషయంలో సినిమా గురించి నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారంటూ.. అది సరికాదంటూ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే.. గబ్బర్ సింగ్ తో పోలిస్తే.. ఓ మెట్టు పైనే ఉండాల్సిన సర్దార్ గబ్బర్ సింగ్ ట్రయిలర్ కానీ, సాంగ్స్ కానీ.. అందుకు తగ్గ స్థాయిలో లేవని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -