Monday, May 20, 2024
- Advertisement -

చదువును పక్కన పెట్టేశాడా?

- Advertisement -

అనుకోకుండా మంచి ఇమేజ్ వచ్చింది. కొన్ని రోజులు జైల్లో ఉండేసరికి.. దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇంకేముంది.. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య.. రాజకీయాల్లో హాట్ కేక్ అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని డైరెక్ట్ గా వెళ్లి కలిసి వచ్చే స్థాయికి కన్హయ్య ఎదిగిపోయాడు. ఓ విద్యార్థి నాయకుడిగా.. విద్యార్థుల సమస్యలపై ఆయన పోరాడితే మంచిదే. కానీ.. రాజకీయంగా చేసే విమర్శలు గమనిస్తేనే.. ఆయన వ్యవహార శైలిపై కొందరు.. డౌట్ పడుతున్నారు.

కన్హయ్య హైదరాబాద్ టూర్ లో కమ్యూనిస్టు పార్టీల నేతలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నిన్న మొన్న లీడర్ అయిన యువకుడికి.. సీపీఐ నారాయణ లాంటి నేతలు రాచమర్యాదలు చేయడం చూసి అంతా విస్తుపోయారు. ఇదంతా గమనించిన మీడియా కూడా.. కన్హయ్య అడుగు తీసి అడుగు పెట్టినా.. బ్రేకింగ్స్ తోనో.. తాజా వార్తలతోనో నానా హంగామా చేసింది. వచ్చింది ఓ విద్యార్థి నాయకుడు కాదు.. జాతీయ స్థాయిలో గొప్ప పేరున్న ప్రముఖ రాజకీయ నాయకుడు అన్నంతగా ప్రాముఖ్యత ఇచ్చింది. ఇదంతా చూసి.. తాను కూడా రాజకీయ నేత అనే అనుకున్నాడో ఏమో.. కన్హయ్య చేసిన కొన్ని కామెంట్లు.. ఆశ్చర్యపోయేలా ఉన్నాయి.

అచ్చంగా కాంగ్రెస్ లీడర్లు, కమ్యూనిస్టు నాయకులు చేసిన కామెంట్లనే.. కన్హయ్య కూడా కమ్మగా సెలవిచ్చాడు. HCU వివాదానికి కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయలే కారణమని తేల్చేశాడు. ఈ వ్యవహారంలో తప్పు ఒప్పుల సంగతి పక్కన పెడితే.. కన్హయ్య కామెంట్లు చేసిన తీరే.. కొందరిని నోళ్లు తెరిచేలా చేస్తోంది. చదువంతా మానేసి.. పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేశాడా అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ విషయం కన్హయ్య చెవిన పడిందో లేదో మరి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -