కొంతమంది జోకులు బాగా వేస్తారు కానీ కొంతమంది మాట్లాడితేనే జోకు లాగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ర్ రాష్ట్రం క్షేమం కోసం , భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడతాము అంటే కూడా ఇలాగే ఉంటుంది.
తాము సేకరించిన కోటి సంతకాలు సోనియా మేడం చేతిలో పెట్టారు కాంగ్రెస్ జనాలు. ప్రత్యేక హోదా తో ఏపీ కి న్యాయం చేస్తాం అని మాట ఇస్తున్నారు ఆవిడ కూడా. ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల్ని సేకరించటం అభినందనీయం అంటూ ఏపీ కాంగ్రెస్ నేతల్ని సోనియమ్మ ప్రశంసించారు.
విభజన చట్టంలోని అంశాలు అమలు చేసే వరకూ కేంద్రం మీద ఒత్తిడి తెస్తామన్న ఆమె.. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం.. పోలవరం ప్రాజెక్టు అంశాలపై పోరాడతామని చెప్పారు. సోనియా తో పాటు ఆమె కొడుకు రాహుల్ గాంధీ కూడా ఏపీ కి న్యాయం జరిగి ప్రత్యేక హోదా ఇచ్చెంతవరకూ పోరాడి తీరతాం అన్నారు. మట్టి, నీళ్ళు తప్ప మోడీ ఏపీ కి చేసింది ఏమీ లేదు అనీ అప్పట్లో ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తాం అని తమ ప్రధాని మన్మోహన్ ఇచ్చిన మాటని గుర్తు చేసారు ఆయన.
విభజన చట్టంలో ఉన్న హామీలు అన్నీ కూడా పూర్తి అయ్యే విధంగా తమ పోరాటం ఉంటుంది అన్నారు ఆయన. ఉమ్మడి తెలుగు రాష్ట్రం గా ఉన్న ఏపీ ని ముక్కలు చేసి విడగొట్టి తెలుగు వరికీ అందునా ఏపీ కి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గు లేకుండా భవిష్యత్తు మనదే, ప్రత్యేక హోదా తెప్పిస్తాం అంటూ కహానీలు చెబుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు అంటున్నాడు సగటు ఆంధ్రోడు.
