Tuesday, May 21, 2024
- Advertisement -

700 గన్ లు వాడిన పవన్ కళ్యాణ్

- Advertisement -

సినిమాలో గన్ ఫైట్ లు భారీగా ఉంటాయి అని చెబితే చాలు పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి సంతకం పెట్టేస్తాడు అనే వ్యూ ఇండస్ట్రీ లో ఉండనే ఉంది. పవన్ కళ్యాణ్ కి గన్ లు అంటే అంత పిచ్చి మరి. గబ్బర్ సింగ్ సినిమా కానీ పంజా లాంటి సినిమా గానీ చూస్తే పవన్ కళ్యాణ్ పిస్టల్ పెలుస్తూనే ఉంటాడు మరి.

సర్దార్ గబ్బర్ సింగ్ గా రాబోతున్న కళ్యాణ్ ప్రోమో వీడియో, టీజర్ , ట్రైలర్ లలో కూడా గన్ కి పని చెప్పాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం కళ్యాణ్ ఏకంగా 700 గన్ లు వాడడం విశేషం. అవన్నీ ఎక్కడ నుంచో కొనుక్కుని ఒచ్చినవి కాదు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి స్వయంగా సృష్టించాడు అవన్నీ. వన్ కళ్యాణ్ ఇప్పటికే మేకింగ్ వీడియో నుంచి ట్రైలర్ వరకూ అన్నింటా తాను గన్ లని ఎలా వాడబోతున్నాడో చూపించేసాడు.

సర్దార్ సినిమాలో సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే గన్ లు వాడడం వాటిని తయారు చెయ్యడం ఒక ఎత్తు అంటున్నారు ఈ ఆర్ట్ డైరెక్టర్. ప్రతీ సన్నివేసం లో దాదాపు గా కళ్యాణ్ చేతిలో గన్ను కనిపిస్తుంది అంటున్నారు.  సినిమాలో బ్రహ్మానందం తుపాకులు అమ్మే దుకాణం నడుపుతుంటాడట. పవన్-బ్రహ్మి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని.. ‘గబ్బర్ సింగ్’లో కంటే కూడా ఇందులో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా పండిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -