Monday, April 29, 2024
- Advertisement -

ఒత్తిడిలో రోహిత్ సేన..రెండో టెస్ట్‌ గెలవకుంటే?

- Advertisement -

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానానికి పడిపోయింది రోహిత్ సేన.

ఇక రెండో టెస్టు విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుండి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవడంతో పాటు టెస్టు ర్యాంకింగ్‌ని మెరుగు పర్చుకుంటుంది టీమిండియా. అందుకే విశాఖ టెస్టు రోహిత్ సేనకు డూ ఆర్ డై కానుంది.స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక రోహిత్ సేన తీవ్ర ఒత్తిడిలో ఉంది.

దీనికి తోడు కోహ్లీ, పూజారా వంటి సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. ఇక రెండో టెస్టు కోసం యువ ఆటగాడు సర్పరాజ్‌కు బీసీసీఐ నుండి పిలుపు రావడంతో అతడి ఎంట్రీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక గాయం కారణంగా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరం కాగా వీరి స్థానంలో సౌరబ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ విశాఖ టెస్టులో గెలిస్తేనే ఒత్తిడిని అధిగమించ గలుగుతుంది రోహిత్ సేన. మరి రెండో టెస్టులో టీమిండియా గెలుస్తుందా లేదా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -