Tuesday, May 14, 2024
- Advertisement -

అలాంటి షకీలా.. ఇలా అయ్యిందేంటి?

- Advertisement -
Shakeela Surprising Role in Kobbari Matta

మలయాళ సినీ పరిశ్రమను ఓ సమయంలో భయపెట్టేసిన హిస్టరీ.. షకీలా కు ఉంది. ఈమె పేరే ఓ పెద్ద బ్రాండ్. షకీలా చిత్రాలతో పోటీ పడలేక.. స్టార్ హీరోలందరూ కలిసి ఆమె సినిమాలను బ్యాన్ చేసే పరిస్థితిపట్టుకొచ్చేసిన ఘనత తన సొంతం. ఆ తర్వాత టాలీవుడ్ లో కమెడియన్ అవతారం ఎత్తి చాలా సినిమాల్లో నటించినా.. ఆ టైపు సాఫ్ట్ టచ్ మాత్రం ఉండేది. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు నటిస్తున్న కొబ్బరి మట్టలో ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనుంది షకీలా.

ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా.. షకీలా ఇలా డిఫరెంట్ గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏజ్డ్ గెటప్ తో షకీలా నటిస్తుండగా.. ఈ కేరక్టర్ సినిమాకి కీలకంగా ఉంటుందని.. ఈమె తన యాక్టింగ్ ట్యాలెంట్ తో మరో యాంగిల్ లో అందరినీ మెస్మరైజ్ చేస్తుందని తెలుస్తోంది.

ఈ హోమ్లీ కేరక్టర్ గానీ క్లిక్ అయితే.. టాలీవుడ్ లో షకీలాకి ఇలాంటి రోల్స్ బోలెడన్ని రావడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. ఈ కొబ్బరి మట్ట సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఏడుగురు హీరోయిన్లు ఈ అందగాడితో ఆడిపాడుతుండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు… మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా పూర్తయిపోయింది. త్వరలోనే విడుదల డేట్ తెలపనున్నారు.

Related

  1. యాంకర్ అనసూయ లవ్ స్టోరి ఇదే..!
  2. సుధీర్‌తో ఎఫైర్‌ గురించి ర‌ష్మీ ఏమంటుందంటే?
  3. ధన్య బాలకృష్ణ కు షాక్ ఇచ్చిన ఆమె ప్రియుడు!
  4. న‌య‌న‌తార ప్రియుడికి ఊహించని షాక్ ఇచ్చిన హ‌న్సిక!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -