Saturday, May 25, 2024
- Advertisement -

న‌య‌న‌తార ప్రియుడికి ఊహించని షాక్ ఇచ్చిన హ‌న్సిక!

- Advertisement -
hansika given shock to nayanatara

సౌత్ ఇండియ‌న్ టాప్ హీరోయిన్ న‌య‌న‌తార‌కు ఇప్పుడు సౌత్‌లో ఎలాంటి ఫాపులరిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుండటంతో సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాంటి న‌య‌న‌తార‌తో పాటు న‌య‌న ల‌వ‌ర్ విఘ్నేష్ శివ‌న్‌కు క‌లిపి పాల‌బుగ్గ‌ల చిన్న‌ది హన్సిక బిగ్ షాక్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే… కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, విఘ్నేష్‌ కాంబినేషన్లో ఓ సినిమా వ‌స్తోన్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంను నయనతార రిక‌మెండ్ చేయడం వల్ల విఘ్నేష్‌కు ఈ ఆఫర్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా కూడా న‌య‌న‌తారనే తీసుకుందాం అని విఘ్నేష్ సూర్య వ‌ద్ద ప‌ట్టుబ‌ట్టాడ‌ట‌. అయితే సూర్య మాత్రం న‌య‌న‌ను కాద‌ని హ‌న్సిక‌ను తీసుకోవాల‌ని చెప్ప‌డంతో విఘ్నేష్ షాక్ అయిన‌ట్టు స‌మాచారం.  

ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఒక హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ కోసం నయనతార, హన్సికల మధ్య పోటీ జరిగింది. ఈ చిత్రంలో నయనతారను ఎంపిక చేశారన్న గుస గుసలు ఆ మధ్య కోలీవుడ్ లో వినిపించాయి. అయితే చివరి నిమిషంలో ఆ అవకాశం హన్సికకే దక్కిందని అంటున్నారు. నయనతార, హన్సికలతో గతంలో సూర్య సినిమాలు చేసినా ఈ సినిమాకు మాత్రం హన్సికకే తన ఓటు వేయడంతో విఘ్నేష్ మౌనం వ‌హించ‌క త‌ప్ప‌లేద‌ట‌.

Related

  1. న‌య‌న‌తార మాయలో టాప్ డైరెక్టర్!
  2. వామ్మో.. మ‌ద్య‌పానం కంటే ముద్దు చాలా డేంజ‌ర్!
  3. టాప్ హీరోకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన న‌య‌న‌తార
  4. వామ్మో.. అన‌సూయ రేటు ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -