Friday, May 10, 2024
- Advertisement -

షకీలా జీవిత చరిత్ర మీద సినిమా

- Advertisement -

శృంగార తారగా సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసింది హాట్ లేడీ షకీలా. అలాంటి షకీలా జీవిత చరిత్రను ఆధారం చేసుకొని ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులోభాగంగా ఓ కన్నడ దర్శకుడికి షకీలా కూడా సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. షకీలా వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందట.

అయితే షకీలా పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లలో సన్నీ లియోన్ లేక బిపాషా బసు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే షకీలా బయోపిక్ లో.. ఇండస్ట్రీలో తనను ఎవరెవరు ఎలా వాడుకున్నరనే విషయాన్ని కూడా ప్రస్తావించబోతున్నారట.

దీంతో షకీలా సినిమాతో సినీ ప్రముఖుల గుట్టు రట్టు కాబోతోందని చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనాలు. ఏదేమైనా షకీలా బయోపిక్ అంటే సెన్సేషన్ కావడం విశేషం. చూద్దాం షకీలా జీవిత చరిత్ర ఎలా రచ్చ చేస్తుందో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -