నారి నారి నడుమ మురారి సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్…ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శర్వా బైకర్ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా ఆ తర్వాత భోగి అంటూ పలకరించనున్నాడు.
సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చేసింది. 1960ల కాలాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతోంది. పూర్తిగా కొత్త కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులకు వినూత్న అనుభూతి అందించనుందని చిత్ర బృందం చెబుతోంది. తాజాగా శర్వా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయగా ఈ పోస్టర్‌లో శర్వా మాస్, రస్టిక్ అవతారంలో కనిపిస్తున్నారు.
ముఖం మట్టితో, బూడిదతో నిండిపోయి, గట్టిగా ముదురిన చర్మంతో 1960ల కాలం నాటి యాక్షన్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. కళ్లలో కోపం, ప్రతీకార భావం స్పష్టంగా కనిపిస్తోంది.చేతిలో ఆయుధం పట్టుకుని, పొడవైన అల్లకల్లోలమైన జుట్టు, ఘనమైన మీసంతో శర్వా మాచో లుక్‌లో కనిపిస్తున్నారు. చెక్కు డిజైన్ గల గాఢ రంగు షర్ట్, మెడలో నల్ల దారం ధరించి గ్రామీణ నేపథ్యంలో పెరిగిన పాత్రను ప్రతిబింబిస్తున్నారు. మొత్తంగా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ సినిమాపై అంచనాలను పెంచింది.
