- Advertisement -

శ్రీకాకుళంలో మంచినీటి కష్టాలు..ఆగ్రహం

- Advertisement -

శ్రీకాకుళం జిల్లాలో డయేరియా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రమైంది. కలుషిత నీటి కారణంగానే వ్యాధి కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ, బాధిత కాలనీలకు తాగునీరు సమయానికి అందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ట్యాంకర్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో రెడ్ క్రాస్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేస్తోంది. అయితే ప్రభుత్వమే అందించాల్సిన ప్రాథమిక సౌకర్యాలను స్వచ్ఛంద సంస్థలు భర్తీ చేయాల్సి రావడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా దళితవాడల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని మహిళలు ఆరోపిస్తున్నారు. డయేరియా వ్యాప్తి జరుగుతున్న సమయంలో కూడా మాకు నీళ్లు ఇవ్వలేరా? అని భుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సమస్యపై స్పందించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.

ప్రభుత్వ ప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకుని శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈసారి ఓట్ల కోసం వస్తే సరైన సమాధానం ఇస్తాం అంటూ హెచ్చరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు అవసరమని స్థానికులు కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -