Monday, April 29, 2024
- Advertisement -

పృథ్విరాజ్‌తో పెళ్లిపై శీతల్!

- Advertisement -

పృథ్విరాజ్‌ విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్. పెళ్లి, పెళ్లి పందిరి, సమర సింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు పృథ్విరాజ్. రీసెంట్‌గా యానిమల్ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించారు.

1994లో బీనా అనే మహిళను వివాహం చేసుకున్నారు పృథ్విరాజ్. వీరికి ఒక బాబు ఉండగా శీతల్ ఎంట్రీతో బీనాకు విడాకులిచ్చారు పృథ్వి. అప్పటికి పృథ్విరాజ్ వయస్సు 57 ఏళ్లు కాగా శీతల్ వయస్సు 24. మొదటి భార్య బీనాతో మనస్పర్థల వలన ప్రశాంతత కోల్పోయాను అన్న పృథ్విరాజ్ ఆమెకు విడాకులు ఇచ్చి శీతల్ ని వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించారు.

2022లో వివాహం చేసుకున్నట్లు వార్తలు రాగా… 2023లో విడిపోయారు. దీనిపై స్పందించింది శీతల్. తాను పృథ్విరాజ్‌ని పెళ్లి చేసుకోలేదని, కేవలం సహజీవనం చేశామని తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మా రిలేషన్ షిప్ అనుకున్నట్లు సాగలేదని, అందుకే విడిపోయామన్నారు. మా నిర్ణయాన్ని గౌరవించి కొంచెం స్పెస్ ఇవ్వాలని క్లారిటీ ఇచ్చేశారు శీతల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -