Sunday, April 28, 2024
- Advertisement -

విజయ్ లాస్ట్ మూవీ..షాకింగ్ రెమ్యునరేషన్!

- Advertisement -

తమిళనాట సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. అలా రాజకీయాల్లోకి వచ్చి రాణించిన హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం పార్టీని ప్రకటించి తర్వాత తప్పుకున్నారు. ఇక తాజాగా హీరో విజయ్ కొత్త పార్టీని ప్రకటించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించేందుకు సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు విజయ్. ప్రస్తుతం విజయ్ తన 70వ సినిమాను నిర్మాత డీవీవీ దానయ్యతో ఒకే చెప్పేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో వస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదే విజయ్ కెరీర్‌లో చివరి సినిమా అని ప్రచారం జరుగుతుండగా దీనికోసం షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. దాదాపు రూ.200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఒక ఈ ఏడావే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచన చేస్తుండగా విజయ్ రెమ్యునరేషన్‌కి సంబంధించిన న్యూస్ మాత్రం వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -