Monday, May 6, 2024
- Advertisement -

నిన్న ప్రేమికులు.. ఇప్పుడు శత్రువులు

- Advertisement -

సిద్ధార్థ.. సమంత సీక్రెట్ లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దాదాపు రెండేళ్ల పాటు నడిచిన ఈ ముచ్చట.. పెళ్లి వరకూ వెళ్లి సడన్ గా పెటాకులయ్యింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా.. కనిపించని వార్ నడుస్తోందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఎవరికి వాళ్లు విడిపోయి.. హాయిగా ఉన్న టైమ్ లో.. ఏం గుర్తొచ్చిందో ఏమో. ఈ మధ్య సోషల్ సైట్ లో సిద్ధార్థ చేసిన కామెంట్ సమంతకు కోపం తెప్పించిందట. అసలు మ్యాటర్ ఏంటంటే.. నిన్నటిదాకా జరిగిన చెడు నుంచి బయటపడి.. ఇప్పుడు మంచిని అనుభవిస్తున్నట్టుగా సిద్ధార్థ పోస్ట్ చేసిన ఓ కామెంట్.. సమంతను చిరాకు పెట్టించినట్టు తెలుస్తోంది.

అసలు తననే అన్నాడో లేదో తెలియదు కానీ.. వెంటనే సమంత కూడా రిప్లై ఇచ్చేసిందట. అసలు గుర్తేలేని పరిచయం నువ్వు… నీలాంటి వ్యక్తి తోడున్నా ఒకటే లేకున్నా ఒకటే అనే రేంజ్ లో కామెంట్ చేసిందట. అంతలోనే ఆ రిప్లై గమనించిన కొందరు.. ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నారు. అయితే.. ఎందుకొచ్చిన గొడవలే అనుకుందో ఏమో.. వెంటనే ఆ రిప్లైని సమంత డిలిట్ చేసేసిందని.. సిద్ధూ కామెంట్ ను లైట్ తీసుకుందని కూడా వినిపిస్తోంది.

ఎవరో మామూలు జంట ఇలా చేస్తే అంతా వదిలేస్తారు. కానీ.. అసలే సెలెబ్రిటీలు.. రోజూ అభిమానులను అలరించే టాప్ స్టార్లు కాబట్టే.. వాస్తవాలు పూర్తిగా బయటికి రాకున్నా… ఈ రూమర్ల గురించి ఇంతలా మాట్లాడుకోవాల్సి వస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -