Saturday, May 4, 2024
- Advertisement -

‘ఆ టైమ్’లో గ్రేటర్ ఎన్నికలు?

- Advertisement -

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో అనూహ్య విజయం సొంతం చేసుకున్న తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్.. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది.

కొన్నాళ్లుగా హైదరాబాద్ లో ఏ రోడ్డు చూసినా.. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వివరిస్తూ.. ఎక్కడికక్కడ భారీ హోర్డింగులు కనిపిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు, కమర్షియల్ యాడ్ లను మించి.. ఎటు చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. రాష్ట్రంలో మరింత పట్టు పెంచుకోవాలన్న దిశగా టీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్రయత్నాలు జనంలో ఆసక్తిని పెంచుతున్నాయి. కేవలం యాడ్స్ తో మాత్రమే ఆగకుండా.. ఎన్నికల తేదీలపైనా అధికార పార్టీ పక్కా లెక్కలతో ప్లాన్ చేస్తున్నట్టు పొలిటికల్ రూమర్లు మొదలయ్యాయి. ఇంతకీ ఆ రూమర్ల మతలబు ఏంటని ఆరా తీస్తే.. టీఆర్ఎస్ ఆలోచనగా ఓ ఆసక్తికర విషయం తెలిసింది.

ఇంకో నెలరోజుల్లో సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. బోగి, సంక్రాంతి, కనుమ పండగ రోజుల్లో సిటీలో జనం ఎలా ఉంటారో అందరికీ తెలుసు. పండగకు సొంత ఊళ్లకు వెళ్లే ఆంధ్ర ప్రజలు లక్షల్లో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులైతే.. రెండో శనివారం, ఆదివారం కలుపుకొని వారం ముందే ప్రయాణానికి సిద్ధమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ తో.. హాయిగా క్రికెట్ ఆడుకునేంత స్థాయిలో బిజీ రోడ్లు, ఫ్లై ఓవర్లు ఖాళీ అయిపోతాయి. సిటీలో.. హైదరాబాద్ లోకల్ పబ్లిక్ మాత్రమే ఉంటారు.

ఇవన్నీ లెక్కలేస్తున్న ప్రభుత్వ వర్గాలు.. పండగ రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నాయట. పండగ టైమ్ లో ఎన్నికలంటే విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.. అవసరమైతే జనవరి 17న ఆదివారం అయినా ఎలక్షన్ నిర్వహిస్తే.. ఏపీ నుంచి ఓటేసేందుకు వచ్చేవాళ్లు తక్కువ సంఖ్యలో ఉంటారని అంచనా వేస్తున్నారట.

ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల నిర్వహణ ఆలస్యంపై హై కోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టుకు వివరణ ఇచ్చింది. ఇప్పుడు.. సిటీలో ఎటు చూసినా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం కనిపిస్తోంది. పైగా.. వరంగల్ విజయంతో అధికార పార్టీ జోష్ లో ఉంది. ఇదే ఊపులో.. సంక్రాంతి నాటికి ఎన్నికలు నిర్వహిస్తే.. అన్నీ కలిసొస్తాయని గులాబీ నేతలు డిసైడైపోయినట్టు తెలుస్తోంది.

ఇందులో నిజానిజాలు తేలాలంటే.. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -