Wednesday, May 15, 2024
- Advertisement -

మోడీ కాదు.. చంద్రబాబే కాబోయే ప్రధానమంత్రి!

- Advertisement -

ప్రస్తుతానికి అయితే నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నారు. ఆయన ఇంకా ఆ పదవీ బాధ్యతలు స్వీకరించి అయ్యింది ఏడాదే! భారత రాజ్యాంగం ప్రకారం అయితే మరో నాలుగు సంవత్సరాలు ఆయన ప్రధానిగ ఉండవచ్చు.

అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం అప్పుడే ప్రధానమంత్రి పదవి గురించి కామెంట్స్ చేస్తోంది. భవిష్యత్తులో ప్రధానమంత్రి మోడీ కాదు… నారా చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేస్తున్నారు తెలుగుదేశం నేతలు.

2024 గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం నేతలు. అంటే 2019 ఎన్నికలు జరిగి ఆ తర్వాత ఐదేళ్లకు జరగబోయే ఎన్నికల గురించి వారు మాట్లాడుతున్నారు. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల గురించి వారు జోస్యం చెబుతున్నారు. ఆ  ఎన్నికలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దేశ ప్రజల ఆమోదాన్ని పొంది దేశానికి ప్రధానమంత్రి అవుతాడని వారు అంటున్నారు.

ఈ మేరకు తెలుగుదేశం నేత యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. 2024 కు చంద్రబాబు దేశానికి ప్రధానమంత్రి అవుతాడని ఆయన చెప్పాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అదే సమయంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏపీలో కూడా అధికారం చేపడుతుంది. అప్పుడు నారా లోకేష్ బాబు ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాడు.. అని కూడా తెలుగుదేశం నేతలు అంటున్నారు.

ఈ విధంగా బాబు ప్రధానమంత్రిగా.. లోకేష్ బాబు ముఖ్యమంత్రిగా ఉంటాడని వారు చెబుతున్నారు. మరి మొత్తానికి ఇలా ఉన్నాయి తెలుగుదేశం నేతల  ఆలోచనలు! పదేళ్లకు అయినా బాబు మోడీని పక్కనకు తోసేసి.. ప్రధాని అవుతాడమాట… చూస్తూ ఉండాలంతే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -