Friday, May 10, 2024
- Advertisement -

రాజశేఖర్ కూతురు ఆ హీరోతో రొమాన్స్..?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీ లో.. రాజశేఖర్, జీవితల గురించి కొత్త పరిచయం చెయాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ చాలా సినిమాలో హీరోగా చేసారు.. ఇప్పుడు కూడా ఆయన హీరోగా గరుడవేగ అనే సినిమా చేస్తున్నారు. అయితే రాజశేఖర్, జీవితలకు ఇద్దరు కూతుర్లు. వారిద్దరూ కూడా సీనీ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే వారిలో పెద్ద అమ్మాయి శివాని ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది.

త్వరగా మెడిసిన్ కంప్లీట్ చేసి.. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. చదువుకుంటూనే ఇప్పుడు ఒక సినిమాలో హీరోయిన్ గా చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి తో రొమాన్స్ చేయ్యబోతుందట. రాజ్ కందుకూరి స్వయంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ 2019 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్న శివ త్వరలోనే తన చదువు పూర్తీ చేసుకొని తిరిగి ఇండియా రాబోతున్నారట. ఆ తర్వాత పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అయితే ఒక కొత్త దర్శకుడు కోసం.. మంచి లవ్ రొమాంటిక్ స్టొరీ ని రెడీ చేస్తున్నారట. ఇక ఈ మూవీలో వీరిద్దరి రొమాన్స్ సూపర్ గా ఉంటుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -