Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ స్టామినాకి తగ్గట్లుగానే!

- Advertisement -

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అభిమానులను అలరించడంలో విఫలం అయింది. సినిమాలో పవన్ తన నటన తో అలరించిన సినిమా కథలో దమ్ము లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా పడింది. సో ఇప్పుడు పవన్ అభిమానులు పవన్ కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో సినిమాకి సిద్ధం అవుతున్నాడు.

గెటప్ మేకోవర్ తో సహా ఈ సహా ఫ్యాన్స్ ని థ్రిల్ చేయడం గ్యారంటీ అంటున్నాడు దర్శకుడు ఎస్ జే సూర్య. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. అభిమానులు ఏ స్థాయిలో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటారో తెలుసని.. వాటిని అందుకుంటానని అంటున్నాడు దర్శకుడు.  ఈ చిత్రంలో శృతి హాసన్ ను హీరోయిన్ గా ఫైనలైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే.. పవన్ శక్తి సామర్ధ్యాలు ఏంటో తనకు పూర్తిగా తెలుసని.. అందుకు తగినట్లుగానే స్టోరీ – నెరేషన్ ఉంటాయంటున్నాడు దర్శకుడు. రాయలసీయ ఫ్యాక్షనిస్ట్ గా పవన్ తొలిసారి పవన్ కనిపించనున్నాడని.. అటు యాక్షన్ – ఇటు ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ రెండూ సమపాళ్లలో మిక్స్ అయి – ఆడియన్స్ ను ఎంటర్టెయిన్ చేస్తాయని ధీమాగా చెప్పాడు దర్శకుడు. 

పవన్-సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఖుషీ బ్లాక్ బస్టర్ కాగా.. పులి డిజాస్టర్ అయింది. ఇప్పుడు మూడోసారి వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న చిత్రానికి హుషారు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కి బ్లాక్ బస్టర్ ఇస్తానని చెబుతున్నాడు ఎస్ జే సూర్య. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -