Wednesday, May 15, 2024
- Advertisement -

నోటిఫికేషన్ ఆపండి -తెలంగాణ సర్కార్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి యుద్ధం ఢిల్లీని తాకింది. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు పార్టీ ఎంపిలు, ఇతర నాయకులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు. అలాగే క్రష్ణా వాటర్ బోర్డు కూడా ఎపి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిచ్చిన కాగితాల మీద క్రష్ణా బోర్డు అధికారులు సంతకాలు పెడుతున్నట్లుగా ఉందని హరీష్ రావు మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి ఉమాభారతికి వినతి పత్రం అందజేశారు. క్రష్ణా బోర్డు ఎపికి అనుకూలంగా నోటిఫికేషన్ తయారు చేసిందని, దాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఆ నోటిఫికేషన్ నిలిపివేయకుంటే కోర్టుకు వెళ్తాం అని ఆయన హెచ్చరించారు. తెలంగాణలోని జురాలను నియంత్రణలో పెట్టిన వాటర్ బోర్డు క్రష్ణ డెల్టా, కెసి కెనాల్ సంగతి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

అలాగే పాలమూరు, రంగారెడ్డికి కేవలం వరద జలాలే కేటాయిస్తారా అని కూడా నిలదీసారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 90 టిఎంసిల నీటిని కేటాయించాల్సిందేనని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తనను కలిసిన తెలంగాణ నాయకులతో మంత్రి ఉమాభారతి చర్చించారు. తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఒక్కటేనని, ఇద్దరికి న్యాయం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -