Sunday, May 5, 2024
- Advertisement -

ఉమాభారతికి లేఖ రాసిన ఎపి సిఎం

- Advertisement -

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ అడ్డగోలుగా వెళ్తోందని, ఉమ్మడి ఆస్తులలో వాటా ఎపి హక్కు అని ఆంధ్రప్రదేశ్ ముఖ‌్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖ రాసారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిసిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమెకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నీటి పారుదల అంశంలో వాటర్ బోర్డు నిర్ణయమే ఫైనల్ అని, అదే అందరికి శిరోధార్యమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి నీటి పారుదల ప్రాజెక్టులపై రాసిన ఉత్తరం విభజన చట్టానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. తెలంగాణ సర్కార్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన 155 టిఎంసిల నీటిని దోచుకుందని, తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ విభజన చట్టానికి వ్యతిరేకంగానే ఉన్నాయని ఆయన విమర్శించారు.

ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్రష్ణా నదిపై ప్రాజెక్టులను నిర్మించతలపెట్టారని, ఇది అన్యాయమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి అఫెక్స్ కమిటి ఒక్కటే పరిష్కారం చూపగలదని సిఎం చంద్రబాబు సూచించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -