Monday, May 6, 2024
- Advertisement -

ప్రభాస్ కి స్పేషల్ ఆహ్వానం!

- Advertisement -

ఇటివలే బాహుబలి సినిమాకి ఉత్తమ జాతీయ అవార్డు సొంతం చేసుకొని తెలుగు సినిమా అంటే ఎంటో నిరుపించింది. అందులో భాగంగా బహుబలిగా నటించిన ప్రభాస్ కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ విషయంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

గతేడాది జూలై 10 న వచ్చిన బాహుబలి ఇంకా దేశవ్యాప్తంగా కొన్ని థియేటర్లలో ఒకట్రెండు షోలు ప్రదర్శించబడుతుండడం గమనార్హం. అయితే ఇప్పుడు ఆ థియేటర్ల యజమానుల నుంచి బాహుబలిగా నటించిన ప్రభాస్ కు తమ థియేటర్లని ఒకసారి సదర్శించమని ప్రత్యేక ఆహ్వానాలు పంపారట.

అనుకోని విధంగా రాతపూర్వకంగా థియేటర్ల యాజమాన్యం నుంచి ఇలాంటి ఆహ్వానం అందటంతో అందుకు ప్రభాస్ సానుకూలంగా స్పందించాడట. కాకపోతే ప్రస్తుతం బాహుబలి2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్ వీలుచూసుకొని ఆయా థియేటర్లని సదర్శిస్తారని తెలుస్తుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం బాహుబలి1 కంటే బాహుబలి2 మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాజమౌళి టీం తీవ్రంగా శ్రమిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -