Saturday, May 4, 2024
- Advertisement -

మెగా అల్లుడితో `లై` హీరోయిన్‌

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్‌ను తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టించ‌డానికి మెగా ఫ్యామిలీ చాలానే క‌ష్ట‌పడుతోంది. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. జతకలిసే ఫేం రాకేశ్‌ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. కల్యాణ్ అరంగేట్రం కోసం మెగా ఫ్యామిలీ భారీ కసరత్తులే చేస్తోంది. ఇప్పటికే కథా, కథనాలను ఫైనల్ చేసిన చిత్ర బృందం ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోంది.

కల్యాణ్ సరసన హీరోయిన్‌గా లై ఫేం మేఘా ఆకాశ్‌ను ఫైనల్ చేశారని స‌మాచారం. మేఘా ప్రస్తుతం నితిన్‌ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తోంది. తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపుపొందిన మేఘా ఆకాశ్ కల్యాణ్‌కు సరైన జోడిగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ విష‌యంపై అధికారిక సమాచారం ఏదీ బ‌య‌ట‌కు రాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించే అవ‌కాశం ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -