తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగి.. ఓ పార్టీ పెట్టి తీవ్రంగా నష్టపోయి బీజేపీలో చేరి ప్రభావం చూపలేకపోతున్న నాగం జనార్దన్‌రెడ్డిపై పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆయన పార్టీ మారుతున్నాడని సమాచారం వస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులు, జంపింగ్ జిలానీలు భారీగా కొనసాగుతున్నాయి. మహామహులు పార్టీలు మారుతుండడంతో నాగం జనార్దన్‌రెడ్డి కూడా పార్టీ మారుతున్నాడని వార్తలు విపరీతం సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఆయన స్పందించారు. ప్రెస్‌మీట్ పెట్టి ఓ క్లారిటీ ఇచ్చారు.
`రాబోయే ఎన్నికలు నాకు చివరి ఎన్నికలు. ప్రజల, కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను పార్టీ మారడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటా! ప్రస్తుతం బిజెపి పార్టీలోనే కొనసాగుతున్నాను. అయితే ఈ విషయంపై ఉగాది తరువాత నా నిర్ణయం వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ ఎదుగుదల కన్పించకపోవడంతో నన్ను అభిమానించే ప్రజలు, కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు. ఈ సమయంలో తాను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ మారే విషయంపై నాగర్‌కర్నూలు నియోజకవర్గ కార్యకర్తలు వచ్చి తనను కలిసిన విషయం వాస్తవమే అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో నాగం జనార్దన్‌రెడ్డి తనవంతు పాత్ర పోషించారు. అయితే రాజకీయంగా సరైన అడుగులు వేయకపోవడంతో ఆయనకు భారీ నష్టం చేకూరింది. కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా అయ్యే అవకాశం రాలేదు. పార్టీ పెట్టి ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే స్థానాన్ని తన కుమారుడు నాగం శశిధర్ రెడ్డి పోటీ చేశాడు. అయితే అతడు పరాజయం పొందాడు. ఎంపీగా పోటీ చేయకుండా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బీజేపీతో పాటు నాగం జనార్దన్‌రెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉండేది. అక్కడ తప్పటడుగు వేసి బోర్లా పడ్డారు.
