Thursday, March 28, 2024
- Advertisement -

అవకాశం కోసం ఎదురు చూస్తున్న శ్రీముఖి

- Advertisement -

బుల్లితెర నటిగా కెరీర్‌ను మొదలు పెట్టి.. సినిమాల్లో తనదైన శైలిలో రాణిస్తోంది.. అందాల నటి.. శ్రీముఖి. 24 ఏళ్ల వయసులోనే చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. జులాయ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ కాదల్ ఇష్క్, చంద్రిక, ధనలక్ష్మి తలుపు తడితే, ఆంధ్రాపోరి, నేను శైలజ, సావిత్రి, జెంటిల్‌మేన్, మనలో ఒక్కడు ఇలా సినిమాలో నటించిన శ్రీముఖి ఆ తర్వాత సినిమాలో కాస్తా జోష్ తగ్గించింది.

శ్రీముఖికి ఛాన్సులు రాకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. అందాలు ఆరబోయడానికి సిద్ధంగా కూడా ఉన్నాను. ఎందుకు నన్ను ఉపయోగించుకోరని శ్రీముఖి ప్రశ్నిస్తోందట. బుల్లి తెరలో ఎంత డబ్బులు ఇస్తారో అంతే డబ్బులు ఇవ్వండి.. ఎక్కువ డబ్బులొద్దు నాకు అని కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలను కలిసి శ్రీముఖి చెప్పినా ఆమెకు మాత్రం అవకాశాలు రావడం లేదు.

ఎందుకంటే హీరోను డామినేట్ చేసేలా శ్రీముఖి ఉంటుంది కాబట్టి ఆమెకు సైడ్ క్యారెక్టర్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. ఇక ఐటం సాంగ్ లో నటింపజేద్దామంటే అది కూడా శ్రీ ముఖి చేయదు. అందుకే శ్రీముఖికి అవకాశం రావడం లేదట. ఐటెం సాంగ్స్ కాకుండా.. వేరే ఏ పాత్ర ఇచ్చిన చేస్తానని అంటుందట. బుల్లితెరపై మాత్రమే నటిస్తూ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నం చేస్తూనే ఉందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -