Sunday, May 12, 2024
- Advertisement -

బాబు ప‌త‌నం ఇక్క‌డినుంచె ప్రారంభ‌మా…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే టిడిపి తరపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరే సమయంలోనే రాజీనామాను సమర్పించారు.ఆ రాజీనామె ఇప్పుడు బాబుకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

పొద్దున్న లేస్తే రాజకీయ నాయకులు విలువల గురించి మాట్లాడే హ‌క్కు ఎవ‌రికి ద‌క్కుతుందంటెఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేతకే ఫస్ట్‌ ప్లేస్‌ దక్కుతుంటుంది. విలువల గురించి మాట్లాడేవారే, విలువల్ని పాటించడం మానేస్తారు. ఇప్పుడు చంద్ర‌బాబుది కూడా అదే ప‌రిస్థితి.

పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చాలా రచ్చే జరుగుతోంది. రాజకీయ నాయకులు పార్టీ మారాలనుకోవడం తప్పు కాదు.. పార్టీ మారేటప్పుడు, తమ పదవులకు రాజీనామా చేయాల్సి వుంటుంది. అది నైతికత. దురదృష్టవశాత్తూ తెలుగు రాష్ట్రాల్లో ఈ నైతికతకు అర్థమే లేదనుకోండి.. అది వేరే విషయం.

నేతలు రాజీనామాలు చేస్తారు, కానీ వాటికి ఆమోదం లభించదు. ఎందుకంటే, ఆ రాజీనామాల్ని ఆమోదించాల్సిన చట్ట సభల అధిపతులు వాటిని ఆమోదించాలితాజాగా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ప్రజా ప్రతినిథి రాజీనామాకు ఆమోదం లభించింది. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, ఆయన రాజీనామాను ఆమోదించారు మండలి ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం.

ఇంత వ‌ర‌కు బాగానె ఉంది కాని 21 మంది ఎమ్మెల్యేల సంగతేంటట.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. అలా పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే దురదృష్టవశాత్తూ హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నిక వచ్చిందిగానీ, స్పీకర్‌ కోడెల శివప్రసాద్ రావు మాత్రం ఇంతవరకు పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకోలేదు.రాజకీయాల్లో నైతికవిలువల గురించి ప్రస్తావించే చంద్రబాబుపై ‘శిల్పా’ రాజీనామా ఆమోదం అంశాన్ని తీసుకొని వైసీపీ ఇరుకునపెట్టే అవకాశాలు లేకపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -