Wednesday, May 8, 2024
- Advertisement -

జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ కోసం ఎదురు చూస్తున్న టీడీపీ ఎమ్మెల్యే..

- Advertisement -

ఏపీలో కాకినాడ‌ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నా… నంద్యాల ఉప ఎన్నిక చుట్టూనె రాజ‌కీయాలు తిరుగుతున్నాయి.ఈ ఉప ఎన్నిక 2019 ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్స్ లాంటివి కావ‌డంతో రెండు పార్టీలు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు.

జ‌గ‌న్ అయితే అక్క‌డ ఏకంగా 15 రోజులు మకా వేశాడంటే ఆ ఎన్నిక‌ను ఎంత ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడో అర్థ‌మ‌వుతోంది. ఈ ఎన్నిక‌ల‌పైనే హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోన్న వేళ అధికార టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌నుంద‌న్న మ‌రో వార్త ఇప్పుడు ఏపీ రాజ‌ధానిలో సెగ‌లు రేపుతోంది. అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విప‌క్ష వైసీపీలోకి జంప్ చేస్తున్నార‌న్న‌దే ఆ వార్తలు బ‌లంగా వినిపిస్తున్నాయి.

టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పి మ‌రీ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు వైసీపీలోకి జంప్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు అమ‌రావ‌తి స‌ర్కిల్స్‌లో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రావెలకు బాబు కేబినెట్‌లో అనూహ్యంగా మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. ఆయ‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు రావ‌డం, ఆయ‌న ఇద్ద‌రు కుమారుల తీరుతో విసిగిపోయిన చంద్ర‌బాబు ఆయ‌న్ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. మంద‌కృష్ణ మాదిగ ఉద్య‌మానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని బాబుకు రిపోర్ట్ వెల్లింది.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని బాబు డెసిష‌న్ తీసుకున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చేశాయి. ఈ విష‌యం తెలుసుకున్న రావెల ఇప్ప‌టికిప్పుడు వైసీపీలోకి జంప్ చేసేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు ఆయ‌న ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డితో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ర‌హ‌స్య చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది.ఇక జ‌గ‌న్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తే పార్టీ కండువ క‌ప్పుకోవ‌డ‌మే మిగిలింది .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -