శ్రీదేవి.. సినీ పరిశ్రమలో అతిలోక సుందరిగా ఒక వెలుగు వెలిగింది. ఈమెకి తెలుగుతో పాటు.. తమిళం, హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అయితే శ్రీదేవి బోనీ కపూర్ పెళ్ళాడే వరకు చాలానే జరిగాయి. అయితే శ్రీదేవికి బోనీ కపూర్ కంటే ముందు పెళ్లి జరిగిన విషయం చాలా మందికి తెలియదు.
బాలీవుడ్ హీరో మిథున్ చక్రబొర్తి 1985లో శ్రీదేవి పెళ్లి అయ్యింది. సినిమాల్లో నటిస్తున్న టైంలో శ్రీదేవితో లవ్ ఎఫైర్ నడిపాడు. మిథున్ చక్రబొర్తికి శ్రీదేవి కంటే ముందే యోగిత అనే ఆమెతో పెళ్లి అయింది. అయినా శ్రీదేవితో ఆయన కలసి ఉండేవాడు. అయితే యొగితను వదలి నాతోనే ఉండాలి అన్నందుకు శ్రీదేవిని రహస్యం గా పెళ్ళి చేసుకున్నాడు మిథున్. తర్వాత యోగిత బెంగతో బాధపడుతుండటంతో.. మళ్లీ ఆమె దగ్గర అయ్యాడు. దాంతో శ్రీదేవికి, మిథున్ చక్రబొర్తికి మధ్య విబేధాలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. అయితే వీరి మధ్య గొడవలను దగ్గర నుంచి బోనీ కపూర్ చూస్తుండేవాడు.
అయితే గొడవ అయిన ప్రతి సారి బోనీ కపూర్ కు శ్రీదేవి చెప్పుకునేది. అయితే మిథున్ ఇంట్లో లేని సమయం లో బోనీ కపూర్ శ్రీదేవి తో మాట్లాడడం కలవడం చూసి తట్టుకోలేక పోయిన మిథున్ శ్రీదేవిని బోనీ కపూర్ కు రాఖీ కట్టి అన్నగా స్వీకరించమని కోరగా ఆమె కట్టింది. అయితే మిథున్ తో గొడలు మరి ఎక్కువ అవ్వడంతో.. ఆమె బోనీకి దగ్గర అయ్యింది. ఆ తర్వాత బోనీ కపూర్ ను పెళ్ళి చేసుకుంది. అయితే ఇక్కడ బోనీ కపూర్‌కు కూడా రెండో పెళ్లి కావడం గమనార్హం.