ఒకప్పుడు షూటింగ్ సమయంలో.. హీరోయిన్ల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని హీరోయిన్ శ్రీదేవి అంటోంది. ఇటివలే శ్రీదేవి నటించిన మామ్ మూవీ రిలీజ్ అయ్యి.. అందరి మన్ననలు అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె ‘మామ్’ సినిమా విశేషాలతో పాటుగా తన గత సినీ జీవిత విషయాలన్నో వివరించారు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రోజుల్లో ఔట్ డోర్ షూటింగుల్లో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఆమె చెబుతుంటే సెన్సిటివిటీ ఉన్న ప్రతి ఒక్కరికీ బాధ కలగక మానదు. అప్పుడు ఔట్ డోర్ షూటింగ్ ల్లో బట్టలు మార్చుకోవాల్సి పరిస్థితి వస్తే.. పొదల్లో, చెట్ల చాటున మార్చుకునే వాళ్లంమని చెప్పింది. ఇపుడు ప్రతి షూటింగ్ స్పాట్లో కారావ్యాన్లతో సహా అన్ని ఏర్పాట్లు ఉంటున్నాయని, అప్పటితో పోల్చుకుంటే ఇపుడు పరిస్థితి చాలా బెటర్ అన్నారు. అప్పట్లో షూటింగ్ లొకేషన్లలో తాను మంచి నీరు కూడా ముట్టుకునేదాన్ని కాదన్నారు. ఎందుకంటే అక్కడ వాష్ రూమ్స్ కూడా ఉండేవి కాదు. రెయిన్ డాన్స్ లాంటివి చేసిన సమయంలో అనారోగ్యం పాలయ్యేవాళ్లమని చెప్పారు. అప్పట్లో ఇలాంటివి చేయాలంటే చాలా చిరాకు అనిపించేదని శ్రీదేవి తెలిపారు. మొత్తానికి అప్పటి విషయాలను ఇప్పటి సౌకర్యాలతో పోల్చుకుని శ్రీదేవి వివరించిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. తన కూతుతు జాన్వి హీరోయిన్ గా ఏంట్రి గురించి ఏం చెప్పాలేదు కానీ తాజాగా తన చిన్న కూతురు ఖుషి గురించి వచ్చిన పుకార్లను ఆమె ఖండించారు. రెమో డిసౌజా నిర్వహిస్తున్న డాన్స్ రియాల్టీ షోలో పాల్గొనాలన్న కోరికతో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ ఆడిషన్స్ కు వెళ్లిందని, ఫైనల్ వరకూ చేరలేకపోయిందని పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. ఖుషి గురించి అలాంటి వార్తలు విని షాకయ్యాను, నా కూతురు ఎటువంటి డ్యాన్స్ క్లాస్ లేదా షోల్లో పాల్గొనడం లేదు. ఇలాంటివి ఎలా ప్రచారంలోకి వస్తాయో అర్థం కావడం లేదని చెప్పింది.
- Advertisement -
షూటింగ్ టైంలో అక్కడే బట్టలు మార్చుకునేవాళ్లాం : శ్రీదేవి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -