Tuesday, May 14, 2024
- Advertisement -

అదృష్టం అంటే శ్రీనువైట్లదే!

- Advertisement -

అవును… అదృష్టం అంటే నిజంగే ఇదే. మెగా కాంపౌండ్ లో ఓ హీరో తో సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా.. అదే మెగా కాంపౌండ్ నుంచి సినిమా చేసే చాన్స్ రావడం.. శ్రీనువైట్ల లక్ కాకపోతే మరి ఇంకేంటి. ఈ మధ్యే రామ్ చరణ్ తో బ్రూస్ లీ లాంటి ఇండస్ట్రీ ఫ్లాప్ ఇచ్చిన శ్రీనువైట్ల.. ఆ తర్వాత ఎన్ని కష్టాలు అనుభవించాడో అందరికీ తెలుసు.

కానీ అంతలోనే మళ్లీ అదృష్టం శ్రీనువైట్ల తలుపు తడుతోంది.వరుస హిట్లతో.. డిఫరెంట్ సినిమాలతో జోరుమీదున్న మెగా హీరో వరుణ్ తేజ్ నుంచి శ్రీనువైట్లకు పిలుపొచ్చింది. వరుణ్ హీరోగా లోఫర్ సినిమా ప్రొడ్యూస్ చేసిన సి.కళ్యాణ్.. త్వరలో శ్రీనువైట్లతో 2 సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అందులో ఒకటి.. వరుణ్ తేజ్ తో చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి స్టోరీ లైన్ ఏదీ ఫిక్స్ అవకపోయినా.. త్వరలోనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.వరుణ్ తేజ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆ విషయం కంచె సినిమాతో ప్రూవ్ అయ్యింది.

కంచెలో.. అవసరాల శ్రీనివాస్ ను ఉద్దేశించి వరుణ్ చెప్పే పిట్ట కథ.. మెగా బ్రదర్ వారసుడిలోని కామెడీ పంచ్ ను బయటపెట్టింది. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ చేయాలని ఆశపడుతున్న వరుణ్.. శ్రీనువైట్ల సినిమాతో ఆ ఆశ తీర్చుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -