Tuesday, May 21, 2024
- Advertisement -

భలే మంచి డైరెక్టర్ తో రవితేజ ?

- Advertisement -

డెబ్యూ డైరక్టర్ ఓ సినిమా హిట్ కొట్టాడంటే ఇక అతనికి అవకాశాల వెళ్లువ మొదలైనట్టే.. రీసెంట్ గా భలే మంచి రోజు అంటూ సుధీర్ బాబుకి సోలో హిట్ ఇచ్చి స్టార్ ని చేసిన డైరక్టర్ శ్రీరాం ఆదిత్య. సినిమా చూసిన ప్రతి ఒక్కరు దర్శకుడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. అయితే సినిమా జనాల్లో చేరవేయడంలో సరికొత్త పంథాని దొరకపట్టిన శ్రీరాం ఆదిత్యకు చూస్తుంటే మంచి ఫ్యూచర్ ఉన్నట్టు అనిపిస్తుంది.

ప్రస్తుతం భలే మంచి రోజు సకెస్ టూర్లో ఉన్న శ్రీరాం ఆదిత్యకు రవితేజ సినిమా దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. సినిమా ఎలాగు పాజిటివ్ టాక్ వచ్చి హిట్ అయ్యింది. అందుకే రవితేజ శ్రీరాం ఆదిత్యతో సినిమా తీసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మాస్ మహరాజ్ కు ఓ మంచి స్టోరీ కూడా రెడీ చేసి చెప్పాడట శ్రీరాం.

ప్రస్తుతం జోష్ మీదున్న ఈ యువ కెరటం స్టార్ డైరక్టర్ అయినా అయిపోతాడనిపిస్తుంది. రెండో సినిమానే రవితేజ లాంటి స్టార్ హీరోతో చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా కూడా హిట్ అయితే ఇక ఈ డైరక్టర్ చుట్టూ ప్రొడ్యూసర్లు క్యూ కట్టడం ఖాయం. ఇప్పటికే తన రెండో సినిమాకు నిర్మాతలు వెంటపడుతున్నారని టాక్.

మొత్తానికి భలే మంచి రోజు నిజంగానే సుధీర్ బాబుకి, శ్రీరాం ఆదిత్యకి మంచి రోజులు తెచ్చిపెట్టాయన్నది వాస్తవం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -