- Advertisement -

తెలంగాణా లో ఇక తెలుగుదేశం భవిష్యత్తు సూన్యం ?

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం భ‌విష్య‌త్తు ఏంటి..? 2019లో తెలంగాణ‌లో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తాన‌న్న అధినేత స్వ‌రం మారిపోయిందా..?  టి.నాయ‌కుల మాట‌ల్ని ఆయ‌న పెడ‌చెవిన పెడుతున్నారా..? క‌నీసం వారానికి ఒక‌సారైనా స‌రే పార్టీ త‌ర‌ఫున తెలంగాణ రాజకీయాల‌ను స‌మీక్షించేందుకు చంద్ర‌బాబు ఎందుకు సుముఖంగా లేరు..?

ఇవ‌న్నీ చూస్తుంటే… తెలంగాణ రాజీకీయాల‌కు చంద్ర‌బాబు నాయుడు దూరంగా ఉండాల‌నే అభిప్రాయంతో ఉన్నార‌ని అర్థం చేసుకోవాల్సి వ‌స్తోంది.ప్ర‌స్తుతం తెలంగాణ‌లో తెలుగుదేశం నేత‌ల‌కు త‌మ అధినేత తీరుపై ఎలా స్పందించాలో వారికే అర్థం కావ‌డం లేదు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు భుజాన చేతులేసి చెట్టాప‌ట్టాలేసుకుంటున్నారు! ఈ నేప‌థ్యంలో తెరాస‌ను నేరుగా విమ‌ర్శించే ప‌రిస్థితి త‌మ్ముళ్ల‌కు లేకుండా చేస్తున్నారు చంద్ర‌బాబు. గ్రేట‌ర్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి.

పాల‌క ప‌క్షంలో లొసుగులు వెతికి విరుచుకుప‌డేందుకు త‌మ్ముళ్లు సిద్ధ‌మౌతుంటే… అలాంటి ప‌నులేవీ చెయ్యొద్ద‌నే చంద్ర‌బాబు సంకేతాలు ఇస్తున్న‌ట్టు స‌మాచారం! ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా తెలంగాణ ముఖ్య‌మంత్రిని క‌లుసుకుంటున్నాన‌ని, దీన్ని రాజ‌కీయ కోణం నుంచి చూడొద్ద‌ని.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌హారాల‌ను స్వతంత్రంగా ఇక్క‌డి నేత‌లే నిర్వ‌హించుకోవాల‌ని గ‌తంలో చంద్ర‌బాబు ఓ క్లారిటీ ఇచ్చారు.

దానికి అనుగుణంగా రాష్ట్రంలో పార్టీతో సంబంధం లేకుండా కేసీఆర్‌తో మైత్రిని కొన‌సాగిస్తున్నారు. అంటే, టి. రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో చంద్ర‌బాబు నేరుగా జోక్యం చేసుకోన‌ని ఇన్ డైరెక్ట్‌గా చెప్పేస్తున్న‌ట్టేనా అనే అనుమానం త‌మ్ముళ్ల‌ను వేధిస్తోంది. అంతేకాదు, తెలంగాణ తెలుగుదేశం వ్య‌వ‌హారాల‌ను చూసుకునేందుకు మ‌రో శ‌క్తిమంతుడై నాయ‌కుడు అవ‌సరం అని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. అంటే, ఇప్పుడున్న నాయ‌కుల‌కు ఆ శ‌క్తి లేదా అన్న‌ది ప్ర‌శ్న‌!

బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంతోపాటు, అర్థ‌బ‌లం ఉన్న నాయ‌కుడి కోసం ఆయ‌న అన్వేషిస్తున్నార‌ని కూడా తెలుగుదేశం వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. తాను నేరుగా టి.రాజ‌కీయాల్లో క‌ల్పించుకుంటే దాన్ని కేసీఆర్ మ‌రో విధంగా వాడుకుంటార‌నీ, అందుకే ఈ రాష్ట్రంతో పార్టీ స్వ‌తంత్రంగానే వ్య‌వ‌హిరించాల‌ని నేత‌ల‌తో ఆయ‌న హిత‌వు ప‌లికిన‌ట్టు తెలుస్తోంది.

అంతేకాదు, కనీసం వారానికి ఒక‌సారైనా తెలంగాణ రాజ‌కీయాల గురించి స‌మీక్షించాల‌ని టి.నేత‌లు కోరినా కూడా చంద్ర‌బాబు తిర‌స్క‌రించార‌ట‌. మొత్తానికి భ‌య‌మో భ‌క్తో కార‌ణం మ‌రేదో తెలీదుగానీ తెలంగాణ రాజకీయాల నుంచి చంద్ర‌బాబు త‌ప్పుకుంటున్న‌ట్టు అర్థం చేసుకోవాల‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -