Tuesday, May 21, 2024
- Advertisement -

కాపులకు రిజర్వేషన్ ఇచ్చావా? ఇవ్వమని అడిగావా చంద్రబాబూ? క్రెడిట్ బాబుకు కావాలి…. పనులు మోడీ చేయాలా?

- Advertisement -

చంద్రబాబు మార్క్ పొలిటికల్ డ్రామా మరోసారి ఆవిష్కృతమైంది. పడవ ప్రమాదంలో ఇరవై మందికి చనిపోవడం…….ఆ ప్రమాదం వెనకాల మంత్రుల పాపం ఉందన్న విషయం సీమాంధ్ర ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి వచ్చేసరికి ఎప్పుడో రెడీ అయిన నంది అవార్డులను ప్రకటించి ఇష్యూ డైవర్ట్ చేశాడు. ఇక 2019 ఎన్నికలకు ఉన్న ఒకే అక్క అస్త్రంగా చంద్రబాబుకు కూడా అర్థమైన పోలవరం నిర్మాణం కూడా హుళక్కి అన్న విషయం చంద్రబాబు మాటలతోనే సీమాంధ్రులకు అర్థమయ్యేసరికి కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చాడు. అత్యంత హాస్యాస్పదం ఏంటంటే సీనియర్ మోస్ట్, నిజాయితీపరుడు అని చెప్పి ఏ మంజునాథ అధ్యక్షతన బాబు కమీషన్ వేశాడో ఆ అధ్యక్షుడు మంజునాథ్ నివేదిక లేకుండానే అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాడు చంద్రబాబు.

కమిషన్ ఛైర్మన్ నివేదిక లేకపోతే ఆ బిల్లును వ్యతిరేకించాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిన విషయం చంద్రబాబుకు తెలియదా? స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ బిల్లు మాత్రం ప్రవేశ పెట్టాడు. ఒకటి వైకాపా లేని ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెడితే క్రెడిట్ మొత్తం కొట్టెయ్యొచ్చన్న దుగ్థ. ఇక పోలవరం ఇష్యూని డైవర్ట్ చేయాలన్న తపన. ఇక బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా టిడిపి నాయకులు, ఆ పార్టీ భజన మీడియా భజన చూడాలీ……..ఒక్క కాపులకే కాదు జనాలందరికీ కళ్ళమ్మట నీళ్ళొచ్చేయడం ఖాయం. జన్మధన్యమైందని ఒకరు, వైఎస్ చేయలేని పని మేం చేశామని చంద్రబాబు, కాపుల రుణం తీర్చుకున్నాం, కాపులకు ఏం చేయాలని తపించిపోయాం, రిజర్వేషన్ ఇచ్చిన ఈ రోజు కాపులంతా పండగ చేసుకోవాలి, అందరూ చంద్రబాబు బొమ్మ పెట్టుకోవాలి……….అబ్బో అన్నీ ఇన్నీ కాదు. టిడి సీరియల్స్‌ నటులు కూడా ఆ స్థాయిలో డ్రామా పండించలేరు.

అసలు చంద్రబాబు కాపులకు రిజర్వేషన్స్ ఇచ్చాడా? రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పి కేంద్రానికి తీర్మానం పంపించాడా అన్న విషయం కూడా కాపు జనాలకు అర్థం కాకూడదని ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే కాపులకు రిజర్వేషన్స్ వచ్చేశాయన్నట్టుగానే మాట్లాడేశారు చంద్రబాబు అండ్ కో. అసలు విషయం ఏంటంటే రిజర్వేషన్స్ ఇవ్వమని కేంద్రానికి తీర్మానం పంపించాడు చంద్రబాబు. కమిషన్ ఛైర్మన్ నివేదిక లేకుండా పంపించిన ఆ తీర్మానం కోర్టుల ముందు నిలబడదు. ఇక చంద్రబాబునాయుడికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం ఇష్టంలేని మోడీ, చంద్రబాబు కోరిన ఏ ఒక్క విషయాన్నీ అంగీకరించని మోడీ ఈ కాపుల రిజర్వేషన్స్ విషయాన్ని మాత్రం ఎందుకు అంగీకరిస్తాడు? అయినా కాపుల రిజర్వేషన్స్ క్రెడిట్ మొత్తం చంద్రబాబు కొట్టేస్తూ, కాపుల ఓట్లన్నీ టిడిపికి పడేలా బాబు అండ్ కో ప్లాన్ చేస్తూ …..ప్రచారం చేస్తూ ఉంటే కాపులకు రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం మోడీకి ఏంటి? ఈ రోజూ రేపూ మన నాయకులు ఎవ్వరూ కూడా రాజకీయ ప్రయోజనం లేకుండా ఏమీ చెయ్యట్లేదుగా.

ఆ మాటకొస్తే కాపు రిజర్వేషన్స్ తీర్మానం వెనకాల చంద్రబాబుకు ఉన్నది కూడా ఓట్ల ఆశనేగా. అలాంటప్పుడు చంద్రబాబుకు ఓట్లు పడేలా మోడీ ఎందుకు చేస్తాడు? కేంద్రప్రభుత్వం ఏం చేసినా కూడా, కేంద్ర ప్రభుత్వం చేసిన పనులన్నింటినీ తన అకౌంట్‌లో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటు. కాకపోతే వాజ్‌పేయి హయాంలో అది చెల్లుబాటయిపోయింది. కానీ మోడీ దగ్గర చెల్లుతుందా? రాజకీయ వ్యూహాల విషయంలో బాబుని మించినవాడు మోడీ. బాబుకంటే ఎక్కువ ప్రచారం కోరుకునే నాయకుడు కూడా. అలాంటప్పుడు ఈ కాపుల రిజర్వేషన్స్ తీర్మానంతో కాపులకు రిజర్వేషన్స్ వస్తాయా? రావన్న విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. కాపుల రిజర్వేషన్స్ విషయంలో చంద్రబాబుకు ఒక్క శాతం చిత్తశుధ్ధి కూడా లేదన్నది నిజం. కానీ ఆ రిజర్వేషన్స్ పేరు చెప్పి మరోసారి కాపుల ఓట్లన్నీ గుంపగుత్తగా కొట్టేయాలన్న రాజకీయ వ్యూహం విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంది. ఎటుతిరిగీ ఎన్నికల టైంకి పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగానో, ప్రత్యక్ష్యంగానో బాబుకు సపోర్ట్ ఇవ్వడం ఖాయం. 2014లో నడిపిన ఈ డ్రామాకు ఓట్లు గట్టిగానే పడ్డాయి. 2019లో కూడా ఇదే డ్రామాతో మరోసారి కాపుల ఓట్లు కొల్లగొట్టగలడా చంద్రబాబు? టిడిపి భజన మీడియా ప్రచార పటాటోపం మరోసారి బాబును గెలిపిస్తుందా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -