Thursday, April 25, 2024
- Advertisement -

ట్యూన్‌ కాపీ చేసిన తమన్‌.. ‘కింగ్‌’ సీన్‌తో నెటిజన్లు ట్రోలింగ్‌

- Advertisement -

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు తమన్‌. ‘అల వైకుంఠపురములో..’ హిట్‌తో తమన్‌ ప్రస్తుతం టాప్‌ రేంజ్‌లో ఉన్నాడు. ఆ సినిమాలోని పాటలన్నీ రికార్డును సృష్టించాయి. ఈ తర్వాత తమన్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్న, పెద్ద సినిమా అనే తేడా హిట్‌ ఆల్బమ్స్‌ అందిస్తూ రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ కంటే ముందంజలో దూసుకెళ్తున్నాడు. పవన్‌కల్యాణ్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌ సహా స్టార్‌ హీరోలందరికీ ఈయనే సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇప్పటికే తమన్‌ సంగీత సారథ్యం వహించిన కొన్ని సినిమాల్లో రవితేజ క్రాక్‌ ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి బల్లేగా దొరికావే బంగారం పాట రిలీజ్‌ అయ్యింది. ఈ సాంగ్‌ మధ్యలో తమన్‌ వాడిన ఓ బీట్‌ లాటిన్‌ చిత్రం ‘సెల్వా ఎల్ నియాన్’ నుండి కాపీ కొట్టాడంటూ నెటిజన్స్‌ తమన్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. బల్లే దొరికిపోయావ్‌ తమన్‌ అంటూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు.

‘‘థ్యాంక్స్‌ అన్న రెండు నెలలుగా కేవలం 47 మాత్రమే ఉన్న వ్యూస్‌ నీ వల్ల రాత్రికి రాత్రే 17కే అయ్యాయ్‌’’, ‘‘సాంగ్‌ లాటిన్‌.. కామెంట్స్‌ తెలుగు.. క్రెడిట్స్‌ తమన్‌.. ఎవరు గుర్తు పట్టరు అనుకున్నారు… కానీ దొరికిపోయారు.. ఈ వీడియో తప్పకుండా వైరల్‌ అవుతుంది’’ అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే కింగ్‌ సినిమాలో నాగార్జున, బ్రహ్మానందం కామెడీ సీన్‌ను మరికొందరు ట్రోలింగ్‌లో వాడుతున్నారు.

కాపీ వివాదం తమన్‌కు కొత్తేవి కాదు
కాపీ వివాదం తమన్‌కు కొత్తేమి కాదు. ఈ ఏడాది తమన్‌ సంగీతం అందించిన వి సినిమాలోనూ తమన్‌ కాపీ వివాదంలో చిక్కుకున్నారు.ఈ సినిమాకు థ‌మ‌న్ కేవ‌లం బ్యాక్‌గ్రౌండ్ సంగీతం మాత్ర‌మే అందించారు. అత‌ను ఇచ్చిన‌ బీజీఎమ్ అదిరిపోయింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ సంగీతం రాక్ష‌స‌న్‌, గేమ్ ఆఫ్ థ్రోన్స్ స‌హా మ‌రికొన్ని సినిమాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను గుర్తు చేస్తోందని నెటిజన్లు ట్రోల్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -