Saturday, May 4, 2024
- Advertisement -

ప్రముఖ హీరో వారసుడు…… డ్రగ్స్‌కి బానిస అయ్యాడా?

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాళ్ళకు లోటు లేదు. అయితే ఇప్పుడు ఓ పుత్ర రత్నం మాత్రం డ్రగ్స్‌లో మునిగితేలుతూ తండ్రి ఆశలను అడుగంటిస్తున్నాడని తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ వంశాల్లో అదొకటి. ఇప్పటికే ఆ వంశం నుంచి చాలా మందే హీరోలు వచ్చారు. కానీ అసలు సిసలు వారసుడంటూ ఇంకో వారసుడిని రంగంలోకి దించడానికి చూస్డున్నారు. అయితే ఆ ప్రముఖ హీరో వారసుడి వ్యవహారం మాత్రం పూర్తిగా బేలన్స్ తప్పి ఉందని తెలుస్తోంది.

ఆ మధ్య యాక్సిడెంట్‌లో చనిపోయిన రాజకీయ నాయకుడి వారసుడికి మనవాడికి మాంచి దోస్తీ ఉంది. ఇక ఈ ప్రముఖ వారసుడికి యాక్టింగ్ అంటే అస్సలు ఇష్టం లేదట. అన్నీ కూడా బిజినెస్ వ్యవహారాలు, డబ్బు చుట్టూ తిరిగే ఆలోచనలే. అన్నింటికీ మించి సావాస దోషమో, మరి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో ఏమో తెలియదు కానీ డ్రగ్స్‌కి మాత్రం బ్రహ్మాండంగా అలవాటుపడ్డాడట. ఎప్పుడూ డ్రగ్స్ మత్తులోనే ఉంటూ ఉంటాడని సన్నిహితంగా ఉండేవాళ్ళు, సంబంధీకులు చెప్తున్నారు. ఆయన తండ్రిగారేమో ఎంత గ్రాండ్‌‌గా ఈ కుమార రత్నాన్ని లాంఛ్ చేద్దామా…….వంశం పరువును మరో కొన్ని తరాల పాటు నిలబెట్టే హీరో నా బిడ్డడే అని చెప్దామా అని తహతహలాడుతూ ఉంటే ఆ కుమార రత్నం నాకు ఆ సినిమాలు వద్దూ…….యాక్టింగ్ వద్దూ….నా పాటికి నన్ను వదిలెయ్యండి అని చెప్తున్నాడట. సినిమా హీరో అంటే ఫిజిక్ మెయింటెయిన్ చెయ్యాలి…….కష్టపడాలి…..ప్రేక్షకులు మెచ్చేలా చాలానే చెయ్యాలి. అదే ఇప్పటికే చాలా సంపద ఉన్న నేపథ్యంలో ఆ డబ్బుతో ఏదైనా బిజినెస్ చేస్తే సినిమా ఇండస్ట్రీ కంటే ఎక్కువే సంపాదించొచ్చు……..అన్నింటికీ మించి మీడియా ముందు ప్రతిసారీ మంచివాడిలా నటించాల్సిన అవసరం కూడా ఉండదు అన్నది అతగాడి ఆలోచనట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -