Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణా ప్ర‌భుత్వంపై తెలంగాణా జ‌న‌స‌మితి పార్టీ అధినేత కోదండ‌రామ్ ఫైర్‌…

- Advertisement -

తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ సభను హైదరాబాద్ లో నిర్వహించేందుకు పోలీసు శాఖ అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ నేత, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో సభ పెడితే అక్కడికి వచ్చే వాహనాల పొగ కారణంగా కాలుష్యం పెరుగుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే, అనుమతివ్వడం లేదని పోలీస్ శాఖ చెప్పిందని అన్నారు.

ఎల్బీ స్టేడియంలో ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతిచ్చారని, ఆ వేడుకకు వాహనాలు రాలేదా? వాటి నుంచి పొగరాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో తమ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించి తీరుతామని కోదండరామ్ స్పష్టం చేశారు.

మ‌రో వైపు ఈ నెల 29న తలపెట్టిన తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. కాలుష్యం సాకుతో అనుమతి నిరాకరించడాన్ని సవాలుచేస్తూ ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఎల్బీ స్టేడియం, సరూర్‌ నగర్‌ స్టేడియం, ఎన్డీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏదో ఒక చోట సభ నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను సోమవారానికి వాయిదావేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -