Monday, April 29, 2024
- Advertisement -

సినిమాల‌కు అనుష్క‌ గుడ్ బై ..?

- Advertisement -

హీరోయిన్ అనుష్క‌….ఇండ‌స్ట్రీలో అంద‌రు ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటారు.ఒక్క తెలుగులోనే కాకుండా ద‌క్షిణాదిన అగ్ర హీరోయిన్ల‌లో ఒక‌రిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అరుంధ‌తి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిన అనుష్క‌,లేడీ ఓరియేటెండ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్రాస్‌గా మారింది.భాగ‌మ‌తి ,బ‌హుబ‌లి సినిమాల‌తో వ‌రుస హిట్లు అందుకున్న అనుష్క ,ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాకు సైన్ చేయ‌లేదు. మాధవన్ సరసన ఓ సినిమాలో, గౌతంమీనన్ దర్శకత్వంలో ఓ సినిమా ఇలా చాలా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆమె వేటిపై స్పందించలేదు.

దేనిపై అధికార ప్రకటన కూడా లేదు. అయితే తాజా విష‌యం ఏటంటే అనుష్క సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింద‌ని స‌మాచారం.ఆమె వయసు మూడు పదులు దాటి చాలా కాలం కావడం ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అందుకే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పింద‌ని తెలుస్తుంది.పైగా పర్సనాలిటీ వ‌ల్ల కూడా అనుష్క‌కు అవ‌కాశాలు రావ‌డం లేద‌ని,దీంతో ఇక సినిమాలు మానేస్తేనే మంచిదనే ఆలోచ‌న‌లో అనుష్క ఉంద‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -