Tuesday, May 14, 2024
- Advertisement -

అరంగేట్రంతోనే 59 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసిన పృథ్వీ షా

- Advertisement -

యువ సంచలనం, ముంబై ఆటగాడు పృథ్వీ షా త‌న తొలి టెస్ట్ మ్యాచ్‌తోనే అనేక రికార్డులు సృష్టిస్తున్నాడు.వెస్టిండీస్‌తో మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన రెండో అతి పిన్నవయస్కుడిగా ఘనత సాధించిన పృథ్వీషా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.అద్బుతమైన టెక్నిక్‌, అసాధారణ ఆట, ఇవన్నీ పృథ్వీ షా సొంతం.వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఈ సంచలనం ఆకాశ‌మే హ‌ద్దుగా చెలరేగిపోయాడు.55 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు.

భారత్‌ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా షా రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా 59 ఏళ్ల రికార్డును పృథ్వీషా బ్రేక్‌ చేశాడు. పిన్న వయసులో తొలి టెస్టు హాఫ్‌ సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో పృథ్వీ షా మూడో స్థానంలో ఉన్నాడు.లంచ్ బ్రేక్ స‌మ‌యానికి పృథ్వీ (75)తన జోరును కొనసాగిస్తూ.. పుజారా(56)తో కలిసి క్రీజులో ఉన్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -