Friday, May 10, 2024
- Advertisement -

అల్లు కాంపౌండ్లో అలకలు మొలకలు

- Advertisement -

అల్లు కాంపౌండ్లో అప్పుడే అలకలు మొలకెత్తుతున్నాయి.అయితే మెగా కాంపౌండ్లో అలకలు మొదలెత్తాలి గాని అల్లు కాంపౌండ్లో ఏంటి నాన్సెన్ అనుకుంటున్నారు. మ్యాటర్లోకొస్తే… గత కొన్ని నెలలుగా అల్లు కాంపౌండ్లో అల్లు శిరీష్ సినీ కెరియర్ పై కాస్త సీరియస్ గానే డిస్కషన్స్ జరుగుతున్నాయి.

శిరీష్ హీరో మెటేరియల్ కాకపోయినప్పటికీ కోట్లు ఖర్చు పెట్టి మరీ సినిమాలు తీస్తే అవి  కనిపించకుండా పోయాయి. తీసిన రెండు సినిమాల్లోను కంటెంట్ భాగానే ఉంది. కాని హీరోగారిని చూడడానికి ఎవ్వరూ సాహసించకపోవడంతో  అల్లు కాంపౌండ్ కున్న గౌరవం కాస్త పోయినట్లయింది. ఈవిషయంపై బన్నీ,అరవింద్ ఓ ఆలోచనకు వచ్చి ఇక చాలు మన ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోమని చెప్పారు.

కాని మనోడు ఊరుకుంటాడా చెప్పండి. లేదు లేదు ఇంకొన్ని సినిమాలు చేశాక చూద్దాం అని చెప్పాడట. దానిలో భాగంగానే శ్రీరస్తు శుభమస్తు సినిమాను చేయడం జరిగింది. ఆసినిమా గురించి ఇటు ఇండస్ట్రీకి అటు అల్లు ఫ్యామిలీకి ఏమాత్రం నమ్మకం లేదు. ఎక్కడ సినిమా తేడా కొడితే పరశ్రమలోని  కొందరు వారసుల్లాగా తాను కూడా ఎక్కడ తమ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవాలోనని సారు తెగ భయపడిపోతున్నాడట. ఇక బన్నీ కూడా తన తమ్ముడితో  కెరియర్ గురించి కాస్త సీరియస్ గానే డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది. 

సో… ఫైనల్ గా శ్రీరస్తు శుభమస్తు ఫలితం చూశాక అల్లు శిరీష్ ఓ డెసిషన్ కు వస్తాడని అతని ఫ్యామిలీ చూస్తోంది. అయితే అతని గురించి భాగా తెలిసిన వారు  చెప్పేదేంటంటే…. రేపు ఈ సినిమా తేడా కొట్టినా…అప్పుడు కూడా నేను హీరోగా సక్సెస్ కొట్టే వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను అని అలక బూనుతాడంటున్నారు. ఈవిధంగా అల్లు కాంపౌండ్లో అలకలు మొలకలెత్తుతూ ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -