Friday, May 3, 2024
- Advertisement -

నిర్మాతపై డిస్ట్రిబ్యూటరే గెలిచాడు

- Advertisement -

నైజాం కింగ్ దిల్ రాజు నిజంగానే మాంచి దిమాక్ ఉన్నోడు. డిస్ట్రిబ్యూటర్ గా  సక్సెస్ అయ్యాక నిర్మాతగా మారి అక్కడ కూడా సక్సెస్ బాట పట్టాడు.ఆ ఇదితోనే అతను వరుస సినిమాలు చేస్తూ అంచనాలు అందుకుంటూ నెంబర్ వన్ ఫిలిం మేకర్ గా వెలుగొందుతున్నాడు.

అయితే గత కొంతకాలంగా దిల్ రాజు చిత్రాలు కొన్ని ఫెయిలౌతున్నాయి.కాని అతను పర్చేజ్ చేస్తోన్న సినిమాలు మాత్రం ఫెయిలవ్వడం లేదు. దీంతో అతని గురి తప్పలేదని మనకు తెలుస్తోంది. బ్రహ్మోత్సవం,సర్దార్ సినిమాలను కావాలని వద్దనుకుని ఆ సినిమాల ఫలితంతో తన డెసిషన్ ఎంతటి స్ట్రాంగో నని డిస్ట్రిబ్యూటర్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.నిర్మాతగా జడ్జ్ చేయలేని సినిమాలను కూడా డిస్ట్రిబ్యూటర్ గాను  జడ్జ్ చేస్తూ ఉండడం అతనికి మాంచి ప్లస్ అయింది.

అంటే ఇక్కడ అతను నిర్మాతగా చేస్తున్నప్పుడు తాను చేసే సినిమా విషయంలో కాస్త లవ్ ఎక్కువై అతని డెసిషన్ తప్పుతూ ఉండొచ్చు.కాని డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న టైమ్లో క్రిటిక్ గా  మారి అప్పటి వరకూ వినని కథను ఒక్కసారిగా విని దానిలో లోపాలను,విషయాలను విశ్లేషణ్ చేసుకుని దాన్ని బట్టి సినిమాలను కొంటున్నాడు.అదే దిల్ రాజు విషయంలో ఎస్సెట్ గా మారింది.ఓవరాల్ గా చూస్తే…దిల్ రాజు  నిర్మాతగా కంటే డిస్ట్రిబ్యూటర్ గానే భాగా సక్సెస్ అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -