Sunday, April 28, 2024
- Advertisement -

బావ కోసం రంగంలోకి మ‌హేశ్ బాబు

- Advertisement -

హీరో సుధీర్ బాబు అవ్వ‌డానికి మ‌హేశ్ బావ అయిన‌ప్ప‌టికి త‌న సొంత టాలెంట్‌తో పైకి రావ‌ల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు.ఈ విష‌యాన్ని మ‌హేశ్ కూడా చాలసార్లు చెప్ప‌డం జ‌రిగింది.ఇటీవ‌ల కాలంలో సుధీర్ బాబు సక్సెస్ రేటు బాగా పెరిగింది.భ‌లే మంచిరోజు,శ‌మంత‌క‌మ‌ణి,సమ్మోహ‌నం వంటి సినిమాలు సుధీర్ బాబుకి హిట్లు ఇచ్చాయి.తాజాగా సుధీర్ హీరోగా న‌టించి ,నిర్మించిన సినిమా ‘నన్ను దోచుకుందువటే.గ‌త శుక్ర‌వారమే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

భారీ ఓపెనింగ్స్ లేకపోయినా .. వసూళ్ల పరంగా నిలకడతో ముందుకు వెళుతోంది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా చేయాల‌ని భావిస్తున్నాడు సుధీర్ బాబు.ఈ స‌క్సెస్ మీట్‌కు త‌న‌య బావ మ‌హేశ్ బాబుని ఆహ్వానిస్తున్నార‌ని తెలుస్తుంది.గ‌తంలో సుధీర్ బాబు కోసం చాలా సినిమా ఫంక్ష‌న్ ఈవెంట్స్‌కు వ‌చ్చాడు మ‌హేశ్‌.త్వ‌ర‌లోనే స‌క్సెస్ మీట్ తేదీని ఖారారు చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -