Wednesday, May 8, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ…దాడుల వెనుక ఉన్న‌ ప్ర‌ముఖ వ్య‌క్తి ఆయ‌నేనా..?

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి నివాసం, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖతో పాటు ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ దాడులు నిర్వహిస్తున్నారు. రేవంత్ సోదరుడు, బంధువుల ఇళ్లలోను తనిఖీలు చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాంటి జ‌ర‌గ‌డంతో ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల్లో ఆందోళ‌న పెరిగిపోతోంది. ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి.

శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ త‌రుపున 15 డొల్ల కంపెనీల‌కు సుమారు రూ.300 కోట్ల ఆర్థిక లావాదేవీలు కొనసాగించినట్లుగా ఆరోపణలు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసుకూడా ప్ర‌ధానంగా చ‌ర్చ‌జ‌రుగుతోంది.రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులపై వివిధ రకాల ప్రచారం సాగింది.

అయితే ఈ దాడుల వెనుక ఓ న్యాయవాది ఉన్నట్లు తెలుస్తోంది. రామారావు అనే న్యాయవాది ఈ ఐటి దాడులకు కారణమని అంటున్నారు. రేవంత్ రెడ్డిపై కొన్ని రోజుల క్రితం రామారావు సిబిఐకి ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డికి సంబంధించిన డొల్ల కంపెనీల చిరునామా రేవంత్ రెడ్డిదే ఉందని, ఆ ఇఇంటి నెంబర్‌-346 అని, ఆ ఇల్లు జూబ్లీహిల్స్‌ లో ఉందని చెబుతూ ఆ ఇంటి చిరునామాను రామారావు సిబిఐకి తన ఫిర్యాదులో ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదును ఐటీ, ఈడీలకు సీబీఐ రెఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే రేవంత్ రెడ్డి ఇళ్లపై, ఆయన బంధువుల ఇళ్లపై సోదాలు జరిగాయనే వాదన వినిపిస్తోంది. విష‌యం ఏదైనా దాడుల‌పై క్లారిటీ రావాలంటే త‌నిఖీ బృందాలే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -