Wednesday, May 8, 2024
- Advertisement -

వాషింగ్టన్ డిసిలో ఓ ఇంటిలోకి మారనున్నారు

- Advertisement -

బరాక్ ఒబామా. అమెరికా అధ్యక్షుడు. ఇది కొన్నాళ్లు మాత్రమే .ఆ తర్వాత ఆయన మాజీ అధ్యక్షుడు అవుతారు. ఎందుకనుకుంటున్నారా. ఇంకెందుకు త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఆ అధ్యక్షుడు రావడానికి ముందే ఒబామా నివాసముంటున్న శ్వేతసౌధాన్ని ఖాళీ చేయాల్సి ఉంది.

దీంతో ఆయన కొత్త ఇంటిలోకి మారనున్నారు. వాషింగ్టన్ డిసిలోని కలోరమాలో 8200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ ఇంట్లోకి ఒబామా కుటుంబం మారబోతోంది. ఈ ఇంటిని 1928 సంవత్సరంలో నిర్మించారు. దీంట్లో తొమ్మిది బెడ్ రూంలు ఉన్నాయి. దీనిని విక్రయించడానికి ముందు ఇందులో వైట్ హౌస్ మాజీ కార్యదర్శి జోలాక్ హార్ట్ ఉండే వారు. ఒబామా చిన్న కుమార్తె శషా హైస్కూల్ చదువు పూర్తి అయ్యే వరకూ వీరి కుటుంబం ఇక్కడే ఉంటుంది. ఇక ఒబామా పెద్ద కుమార్తె మలియా హార్వార్డ్‌లో మెట్రికులేషన్ చదువుతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -