Monday, April 29, 2024
- Advertisement -

సైరా త‌ర్వాత సుకుమార్‌తో మెగాస్టార్‌

- Advertisement -

ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ నెమ్మ‌దిగా సాగుతోంది. ఈ సినిమా మ‌ధ్య‌లో ఆగిపోయే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా మొద‌లెట్టిన‌ప్ప‌టి నుంచి స‌క్ర‌మంగా ప‌నులు జ‌ర‌గ‌డం లేదు. అయితే ఈ సినిమా పూర్తి కాక‌ముందే మెగాస్టార్ చిరంజీవి ఓ మంచి సినిమాను అంగీక‌రించారంట‌. మాస్ మసాలా స్టోరీతో చిరంజీవిని ఫ్లాన్ వేశారంట‌.

అయితే ఆ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం చేస్తారంట‌. దాదాపు అర్థగంట పాటు స్టోరీ నెరేట్ చేసి చిరంజీవికి వినిపించారంట‌. చాలా ఎగ్జయిట్ అయ్యి వెంట‌నే సినిమాను డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని చెప్పారంట‌. సుకుమార్ స్టయిల్ లోనే ఈ సినిమాలో కూడా ఓవిలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నాడట చిరు.

తన కథలతో హీరోలను ఒప్పించడం సుకుమార్‌కు వెన్నతో పెట్టిన విద్య. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్, వన్-నేనొక్కడినే సినిమాలో మహేష్ నటించారంటే దానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ సుకుమార్ సత్తానే. రంగస్థలం సినిమాలో చెవిటివాడిగా నటించడానికి రామ్ చరణ్ ఒప్పుకున్నాడంటే సుకుమార్ టాలెంట్ అర్థం చేసుకోవచ్చు. ఇదే టాలెంట్ తో ఓ డిఫరెంట్ రోల్ తో, సరికొత్త కథతో చిరంజీవిని ఒప్పించాడట సుక్కూ.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -