Sunday, May 5, 2024
- Advertisement -

‘భరత్ అను నేను…’ గా మహేష్ ఫస్ట్ లుక్, ప్రమాణ స్వీకారం ఎలా ఉన్నాయంటే?

- Advertisement -

సమ్మర్‌లో ఒకే డేట్‌కి రిలీజ్ అవుతాయా అన్న టెన్షన్స్ క్రియేట్ చేస్తూ ఒకదానితో ఒకటి పోటీపడతాయా అన్న ఆందోళనను బయ్యర్స్‌లో రేకెత్తిస్తున్న భరత్ అను నేను, నా పేరు సూర్య….నా ఇల్లు ఇండియా సినిమాలు ఒకేరోజు వాటి ఇంపాక్ట్ చూపించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నా పేరు సూర్య….నా ఇల్లు ఇండియా గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక భరత్ అను నేను….వ్యవహారానికి వస్తే మహేష్ ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలానే ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మహేష్ లుక్ మరీ రొటీన్ అయిపోతోందన్న విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా భరత్ అను నేను ఫస్ట్ లుక్ కాస్ట్యూమ్స్ కూడా స్పైడర్ కాస్ట్యూమ్స్‌కి దగ్గరగా ఉండడం గమనార్హం. ఈ రొటీన్ అన్న విమర్శలను పక్కనపెడితే ఫస్ట్ లుక్ బాగానే ఉంది అని చెప్పాలి. ముఖ్యమంత్రి ఛాంబర్, ఛాంబర్‌లో మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలు…ఇతర ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. మహేష్ బాడీ లాంగ్వేజ్‌తో ఇచ్చిన మెస్సేజ్ కూడా రీచ్ అయ్యేలానే ఉంది. ఒక కమిటెడ్ ముఖ్యమంత్రి అన్న ఇంప్రెషన్ అయితే ఇచ్చారు.

ఇక భరత్ అను నేను …..ప్రమాణస్వీకారం వీడియో మాత్రం బాహుబలి-2 ట్రైలర్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యారని తెలుస్తోంది. కాకపోతే ప్రభాస్ స్థాయిలో మహేష్ వాయిస్ ఓవర్ గంభీరంగా పలకలేకపోయింది. మామూలుగా కూడా సింగిల్ లైనర్స్ అయితే మహేష్ గంభీరంగా చెప్పగలడు కానీ భారీ డైలాగులు చెప్పడంలో మాత్రం అడ్డంగా దొరికిపోతూ ఉంటాడు. సినిమా అంతా మాట్లాడుతూనే ఉన్న ఆగడు సినిమాలో ఆ బలహీనత మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇప్పుడు భరత్ అను నేను ప్రమాణస్వీకారం కూడా ఒక స్పెషల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. కేవలం మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నట్టుగా వాయిస్ మాత్రమే ఉన్న ఆ ఆడియోలో మహేష్ వాయిసే వీక్ అయిపోవడంతో ఇక చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. అయితే మొత్తంగా చూస్తే మాత్రం కొరటాల గత సినిమాల తరహాలోనే ఈ సినిమాలో సూపర్ మెస్సేజ్ అయితే ఉంటుంది అన్న విషయం అర్థమైపోయింది. అలాగే మరీ రొటీన్ రొడ్డకొట్టుడు మసాలా ఫిల్మ్ కాదు…..కాస్త విషయం ఉన్న సినిమా అన్న క్లారిటీ కూడా వచ్చింది. ఇప్పటికే ఒకే ఒక్కడు, లీడర్ లాంటి సినిమాలు చూసి ఉన్న ప్రేక్షకులకు ఈ భరత్ అను నేను…ఎలాంటి సరికొత్త అనుభూతిని ఇస్తుందో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన అజ్ఙాతవాసి సినిమా బయ్యర్స్‌ని అడ్డంగా ముంచేసిన నేపథ్యంలో ఈ భరత్ అను నేను…..అనే భారీ బడ్జెట్ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి మరి. ఆ విషయం త్రివిక్రమ్ కంటే కొరటాల విషయం ఉన్న డైరెక్టర్ అని……గత సినిమాల తరహా చూసినా కూడా కొరటాలను కచ్చితంగా నమ్మొచ్చు అన్నది ఇండస్ట్రీ జనాల మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -