Tuesday, May 7, 2024
- Advertisement -

క‌ష్టాల్లో భార‌త్‌…లంచ్ విరామ‌స‌మ‌యానికి 100/4

- Advertisement -

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతున్నది. బౌలర్ల హవా నడుస్తున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మూడో రోజు లంచ్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. లంచ్ విరామ స‌మ‌యానికి 100 పరుగులు చేసిన కోహ్లి సేన 93 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. నాలుగో ఇన్నింగ్స్‌లో 150 నుంచి 200 పరుగుల లక్ష్యం కూడా కష్టమేనని భావిస్తున్న సమయంలో.. టీమిండియా కనీసం మరో వంద పరుగులు చేయగలిగినా.. మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది.

ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న మురళీ విజయ్‌ (25; 127 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. రబాడ వేసిన 40.5వ బంతికి బౌల్డ్‌ అయ్యాడు. రబాడ వేసిన బంతి మురళీ పాదాలు, బ్యాట్‌ మధ్యంలోచి వెళ్లి వికెట్లను తాకింది

వికెట్ నష్టానికి 49 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. తొలి సెషన్‌లో మరో మూడు వికెట్లు కోల్పోయింది. విజయ్ (25), రాహుల్ (16), పుజారా (1) ఔటయ్యారు. రెండో వికెట్‌కు రాహుల్, విజయ్ 34 పరుగులు.. నాలుగో వికెట్‌కు కోహ్లి, విజయ్ 53 పరుగులు జోడించారు. ప్రస్తుతం కోహ్లి 27 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -