Friday, April 26, 2024
- Advertisement -

తమన్నాకొసం పట్టు బడుతున్న సుకుమార్ !

- Advertisement -

అల్లుడు శ్రీను సినిమా లో ఐటెం నెంబర్ చేసి తాను కూడా జనాలని థియేటర్ లో డాన్స్లు చెయ్యించగలను అని ప్రూవ్ చేసింది

మిల్కీ బ్యూటీ తమన్నా, ” ఇంటి పేరు సిల్కూ” అంటూ వినాయక్ డైరెక్ట్ చేసిన ఆ పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 

కానీ ఐటెం గర్ల్ గా ఆమెకి మంచి పేరు వచ్చిందా లేదా అనేది పెద్ద ప్రశ్న. తాజాగా మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్టీఆర్ – సుకుమార్ ల సినిమా “నాన్నకు ప్రేమతో” (వర్కింగ్ టైటిల్) లో ఆమె ఒక ఐటెం సాంగ్ చెయ్యబోతోంది అంటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఆమె కోసం ఒక సూపర్ ఐటెం సాంగ్ సిద్దం చేసాడు అని తెలుస్తోంది. సుకుమార్ – దేవీ ల కాంబినేషన్ లో ఇప్పటి వరకూ వచ్చిన ప్రతీ ఐటెం సాంగ్ మామూలు హిట్ కాదు.

అప్పట్లో ఆ అంటే అమలాపురం దగ్గర నుంచీ నిన్న మొన్న వచ్చిన లండన్ బాబూ వరకూ సుకుమార్ కి ఐటెం సాంగ్ ల మీద ఉన్న గురికి ఈ పాటలు మచ్చుతునక. కాబట్టి ఈ సినిమా లో ఐటెం నెంబర్ కూడా అదిరిపోవాలని, కొత్త అమ్మాయిని కాకుండా తమన్నా నే తీసుకోవాలని పట్టుబడుతున్నాడు సుకుమార్. 

నందమూరి ఫాన్స్ ఈ న్యూస్ తో హ్యాపీగా ఉన్నారు. ఊసరవెల్లి తరవాత ఎన్టీఆర్ – తమన్నా కలిసి నటించబోతున్న చిత్రం ఇదే అవుతుంది 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -