Wednesday, May 8, 2024
- Advertisement -

షార్ట్ కట్ లో ఫిలిం ఫీల్డ్ లో ఎదగాలనుందా..? ఇదిగో ఛాన్స్

- Advertisement -

చాలామంది కుర్రకారు….. రాత్రికి రాత్రే సినీ పరిశ్రమలో ఏదో అయిపోవాలని కలలు కంటూ ఉంటారు.

ఎన్ని కష్టాలు పడ్డ చివరికి అనుకున్నది సాధించలేరు. దానికి కారణం కరెక్ట్ గా అవకాశం ఇచ్చేవారు లేకపోవడం, అవకాశాలను సృష్టించుకోలేకపోవడం. అందుకే ఈ బాధలు చూసిన ఓ నిర్మాత దర్శకులు ,టెక్నీషియన్స్ ,నటీనటులు అవ్వాలనుకునేవారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 

తమ నిర్మాణ సంస్థ అయినటువంటి భీమవరం టాకీస్‌ ద్వారా ‘షార్ట్‌ ఫిలిం కంటెస్ట్‌’ కండక్ట్‌ చేస్తున్నారు.ఇందుల్లో టాప్‌ టెన్‌ షార్ట్‌ ఫిలింస్‌ను ఎంపిక చేసి.. సదరు షార్ట్‌ ఫిలింస్‌ రూపొందించిన ప్రతిభావంతులకు.. భీమవరం టాకీస్‌ నిర్మించే చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం కల్పిస్తారు. అక్కడితో ఊరుకోకుండా …ఆ షార్ట్‌ ఫిలింస్‌లో నటించిన నటీనటులు మరియు ఆయా షార్ట్‌ ఫిలింస్‌కు పని చేసిన సాంకేతిక నిపుణులకు సైతం  సినిమా ఛాన్సు ఇవ్వాలని చూస్తున్నారు. 

ఈ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసేవారు  అక్టోబర్‌ 2 లోపు తమ పేర్లు నమోదు చేసుకొని.. అక్టోబర్‌ 31 లోపు తమ షార్ట్‌ఫిలింస్‌ను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. గడువు లోపు తమకు అందిన షార్ట్‌ ఫిలింస్‌ నుంచి టాప్‌ టెన్‌ను సెలెక్ట్‌ చేసేందుకుగాను ఈ సంస్థ ఓ కమిటీని నియమించింది. ఇందుల్లో ప్రముఖ సీనియర్ దర్శకులు రేలంగి నరసింహరావు, ప్రముఖ నటి గీతాంజలి, ఛాయాగ్రహకుడు`దర్శకుడు యం.వి.రఘు, ప్రముఖ రచయిత తోటపల్లి సాయినాధ్‌, దర్శకులు యం.గోపాలకృష్ణ, బాబ్జీ, ప్రముఖ నటుడు `దర్శకుడు కాదంబరి కిరణ్‌కుమార్‌, ప్రముఖ నిర్మాత జె.వి.మోహన్‌గౌడ్‌, మహిళా నిర్మాత మరియు సెన్సార్‌బోర్ట్‌ సభ్యురాలు నాగులపల్లి పద్మిని, ప్రముఖ దర్శకనిర్మాత సాయివెంకట్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 

టాప్‌ టెన్‌ షార్ట్‌ ఫిలిం మేకర్స్‌కు నవంబర్‌ 15న జరిగే కార్యక్రమంలో రాంగోపాల్‌వర్మ చేతుల మీదుగా జ్ఞాపికలు బహూకరింపజేయడంతోపాటు.. భీమవరం టాకీస్‌ నిర్మించే చిత్రాలకు దర్శకులుగా వారిని అదే రోజు ప్రకటించనుండడం విశేషం.

సో దర్శకులు,టెక్నీషియన్స్ ,నటీనటులు కావాలనుకునేవారికి ఇంతకంటే ఛాన్స్ మరొకటి ఉండదు.మరి  షార్ట్‌ ఫిలింస్‌ను తమ కెరియర్ కు కరెక్ట్ ప్లాట్‌ఫాం గా వాడాలనుకునేవారు    [email protected] లో సంప్రదించగలరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -