Friday, May 17, 2024
- Advertisement -

సుమ ఏంత సంపాదిస్తుందో తెలుస్తే.. వామ్మో అంటారు

- Advertisement -

యాంకర్ సుమ.. ఈమెకు ఇప్పుడు ఏ రెంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై వ్యాఖ్యాతగా ఇటు ఆడియో ఫంక్షన్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ రెండు చేతులా డబ్బు సంపాదిస్తోంది. 1974 మార్చి 22 న సుమ జన్మించింది. ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ రావటంతో సుమ బుల్లితెర నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.

హీరొయిన్ గా గూడా చేసింది. నటన పక్కన పెట్టి.. ఇక పూర్తిస్థాయి బుల్లితెర వ్యాఖ్యాతగా మారిపోయారు. 1999 ఫిబ్రవరి 10 న ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ను పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లిచేసుకున్నారు. వీరికి రోషన్ అనే కుమారుడు మనస్విని అనే కుమార్తె ఉన్నారు. సుమను అనర్గళంగా మాట్లాడగల సత్తా ఉన్న ఏకైక యాంకర్ అని చెప్పడంలో ఆతిశయోక్తి లేదు. ఇక ఈమె రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపడుతారట. ఒక టాప్ హీరోయిన్ సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో.. సుమ సంవత్సరంలో తన టీవి షో లు, సినీ వేడుకల ద్వారా అంతకు రెండు రెట్లు ఎక్కువగానే సంపాదిస్తోందట. ఇక మల్టీ టాలెంటెడ్ అయిన సుమ ఇటీవల ఓ సినిమాలో పాట కూడా పాడింది. ఇప్పటి యాంకర్స్ చాలా మందికి తెలుగు సరిగ్గా రాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మాతృభాష తెలుగు అయినప్పటికీ సుమ కి ధీటుగా ఇప్పటితరం టీవీ యాంకర్లు పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఈమె నెల సంపాదన 30 లక్షల వరకు ఉంటుందని టాలీవుడ్ పత్రికల కథనాల సారాంశం. ఇటీవల కొన్ని టీవీ షోస్ కి నిర్మాతగా మారి మరింత డబ్బును సంపాదిస్తోందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -