Wednesday, May 22, 2024
- Advertisement -

చంద్ర‌బాబు వ్యూహాన్ని…ఎదుర్కొంటాడా….?

- Advertisement -

వ‌చ్చె సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌నాటికి పార్టీని స‌మాయాత్తం చేసేందుకు చంద్ర‌బాబు సిద్ద‌మ‌వుతున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయ‌నె ఆలోచ‌న‌తో పార్టీ నాయ‌కుల‌ను ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చారు. మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన టీడీపీ వ‌ర్క్ షాపులో పార్టీ నాయ‌కుల‌కు దిశా నిర్దేశం చేశారు చంద్ర‌బాబు.

వ‌చ్చె ఎన్నిక‌ల‌ను ఎలా ఎదుర్కొవాలి, ఎలాంటి వ్యూహాల‌తో వెల్లాలి అనే దానిమీద సుదీర్ఘ ఉప‌న్యాసం ఇచ్చారు బాబుగారు. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ఎలాగెలిచామో అలాంటి స్ట్రాట‌జీని కూడా 175 నియేజ‌క వ‌ర్గాల్లో అమ‌లు చేయాల‌ని నాయ‌కుల‌కు పిలుపు నిచ్చారు. అక్క‌డ అమ‌లు చేసిన మూడు పీపీపీల గురించి వివ‌రించారు. మూడు పీపీపీలు అంటె పోల్‌మేనేజ్‌మెంట్‌, పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్‌, ప‌బ్లిక్ మేనేజ్‌మెంట్‌. వీటిని విన్న నాయ‌కులు షాక్ అయ్యారంట‌.

ఇక నంద్యాల‌లో పోల్ మేనేజ్ మెంట్‌లో భాగంగా అక్క‌డి అధికారుల‌ను ఎలా మేనేజ్ చేశారొ అంద‌రికి తెలిసిందే. ఇక పొలిటిక‌ల్‌గా చూసుకుంటె మంత్రులు, ఎమ్మెల్యేలును భారీగా దింపి పొలిటిక‌ల్ మ‌నేజ్ మెంట్ చేశారు. ప‌బ్లిక్ మేనేజ్‌మెంట్ చూసుకుంటె చెప్పాల్సిన ప‌నిలేదు. ట్రాక్ట‌ర్లు,ల్యాప్‌ట్యాప్‌లు, ఫింఛ‌న్లు ర‌క‌ర‌కాల తాయిలాలా ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌మ‌పెట్టారు. ఈ మూడింటిని మేనేజ్ చేయ‌టంలో చంద్ర‌బాబు దిట్ట‌.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌శ్చితంగా ఈ మూడింటితో ఎన్నిక‌ల‌కు వెల్తార‌న‌డంలో సందేహంలేదు. మ‌రి జ‌గ‌న్ వీటిని ఎలా అధిగ మిస్తార‌నె ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఈ మూడింటిమీద‌నె జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నారంట‌. జ‌గ‌న్‌కు ఎలాగు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌న‌డంలో సందేహంలేదు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలు అమ‌లు చేస్తారొ చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -