Saturday, May 18, 2024
- Advertisement -

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో సునీల్ రోల్ ఇదే

- Advertisement -

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో త్రివిక్రమ్‍తో ఎన్టీఆర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ కాంబినేషన్ సెట్ అయింది. పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ సినిమాకి క్లాప్ బోర్డు కొట్టడంతో సినిమా స్టార్ట్ అవ్వకముందే భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. అంతేకాకుండా ఇప్పటికి కూడా ఆ మ్యాటర్ చర్చనీయంశంగా మారింది.

ఎక్కడ చూసిన పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బలే కలుసుకున్నార్రా..? అంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇక అసలు విషయంకు వస్తే ఈ కథలో ఇక ఇంపార్టెంట్ పాత్ర కోసం నారా రోహిత్ ని అనుకున్నట్లు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దానికి విరుద్దంగా మరొక న్యూస్ హల్ చల్ చేస్తోంది. నారా రోహిత్ కి దక్కాల్సిన ఛాన్స్ ని సునీల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా సునీల్ కమెడియన్ పాత్రలను చేయడానికి రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీలో ఒక స్పేషల్ రోల్ కి సునీల్ ని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సునీల్, త్రివిక్రమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిన విషయమే.

వీరి కలయికలో మూవీ ఉంటుందని టాలీవుడ్ లో చాలా సార్లు వార్తలు వచ్చాయి. అసలైతే సునీల్, పవన్ 25వ చిత్రంలో కనిపిస్తున్నాడని అందరు అనుకున్నారు. కానీ అది నిజం కాదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో తప్పకుండా ఉంటాడని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే త్రివిక్రమ్ గారే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -