- Advertisement -

నవంబర్ 8న విపక్షాలు బ్లాక్ డేకి పిలుపు… న‌ల్ల‌ధ‌న వ్య‌తిరేక దినోత్సవానికి బీజేపీ పిలుపు..

- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దేశంలో ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టేందుకు న‌వంబ‌ర్ 8న రాత్రి నోట్ల‌ను ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నాల‌కు తెర‌దీశారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌జ‌లు ఎలాంటి క‌ష్టాలు అనుభ‌వించారో తెలిసిందె. డ‌బ్బుల‌కోసం క్యూలో నిల‌బ‌డ‌లేక చ‌నిపోయిన సంఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం న‌ల్ల‌ధ‌నం ఎంత అనేది పూర్తిగా ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి లెక్క‌లు లేవు.

నోట్ల ర‌ద్దునిర్ణ‌యాన్ని దేశంలోని ప్ర‌తిప‌క్ష‌పార్టీలు పూర్తిగా వ్య‌తిరేకించాయి. పార్టీల‌తో పాటు ఆర్థిక నిపుణులు, మేధావులుకూడా మోదీ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు.అప్ప‌టినుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ పార్టీలు ఎన్‌డీఏ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనె ఉన్నాయి.

పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు న‌ష్ట వ‌చ్చింద‌ని, ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డార‌ని దేశంలోని విప‌క్ష పార్టీల‌న్నీ పెద్ద ఎత్తున వ‌చ్చేనెల‌ నిర‌సన కార్య‌క్ర‌మాల‌ను జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.

అయితె భాజాపాకూడా న‌వంబ‌ర్ 8న భార‌తీయ జ‌నతా పార్టీ ఆధ్వ‌ర్యంలో దేశ వ్యాప్తంగా న‌ల్ల‌ధ‌న వ్య‌తిరేక దినం జ‌రుపుతామ‌ని ఈ రోజు కేంద్ర‌ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారు. దేశ వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ నాయ‌కులు పాల్గొంటారని చెప్పారు. న‌ల్ల‌ధ‌నానికి వ్య‌తిరేకంగా తీసుకున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు ఎవ‌రికి మ‌ద్ద‌తు తెలుపుతారొ చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -